యాప్నగరం

కరోనాకు కోపమొచ్చింది... టిక్‌టాక్‌లో వెకిలి చేష్టలు చేసిన యువకుడికి పాజిటివ్

కరోనా వైరస్‌పై టిక్‌టాక్‌లో వెకిలి చేష్టలకు పాల్పడిన యువకుడికి పాజిటివ్ రావడం మధ్యప్రదేశ్‌లో కలకలం రేపింది. ఐసోలేషన్ వార్డులోనూ అతడు టిక్‌టాక్ చేయడంతో అధికారులు ఫోన్ స్వాధీనం చేసుకున్నారు

Samayam Telugu 14 Apr 2020, 4:32 pm
కరోనా నుంచి కాపాడుకునేందుకు మాస్కులు ధరించడాన్ని ఎగతాళి చేస్తూ టిక్‌టాక్‌లో వీడియోలు చేసిన యువకుడి కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపింది. మధ్యప్రదేశ్‌‌లోని మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన సమీర్ ఖాన్(25)కు టిక్‌టాక్ వీడియోలు చేయడం అలవాటు. ఇటీవల కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ‘దేవుడిని నమ్ముకోండి.. మాస్కులను కాదు’ అంటూ టిక్‌టాక్‌లో వీడియోలు పోస్ట్ చేశాడు. అతడి వీడియోలపై అనేక మంది నెటిజన్లు ఘాటుగా కామెంట్లు చేశారు.
Samayam Telugu pjimage (3)


Also Read: బాలికపై 10 మంది మూడేళ్లుగా అఘాయిత్యం.. గర్భం దాల్చడంతో

ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం అతడి దగ్గు, జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నాడు. కరోనా లక్షణాలు కనిపించడంతో కుటుంబసభ్యులు అతడికి కరోనా టెస్ట్ చేయించగా పాజిటివ్ అని తేలింది. ఇటీవల తన అక్క ఇంటికి వెళ్లి వచ్చిన తర్వాత సమీర్‌లో కరోనా లక్షనాలు బయటపడినట్లు అధికారులు గుర్తించారు. దీంతో సమీర్‌తో పాటు అతడి కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగు వారిని కూడా క్వారంటైన్‌కు తరలించారు.

Also Read: మద్యం దానం చేస్తూ టిక్‌టాక్ వీడియో.. హైదరాబాద్ యువకుడి అరెస్ట్

అయితే సమీర్‌ ఐసోలేషన్ వార్డుకు వెళ్లిన తర్వాత కూడా టిక్‌టాక్ వ్యసనాన్ని విడిచిపెట్టలేదు. అక్కడి నుంచే వీడియోలు తీస్తూ ‘తాను త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థించండి’ అని కోరాడు. ఈ వీడియో చూసి నెటిజన్లు అతడిని విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. కరోనాను ఎగతాళి చేసేందుకే నీకు పాజిటివ్ వచ్చిందంటూ కామెంట్ చేశారు. అయితే సమీర్ టిక్‌టాక్ వీడియో వ్యవహారం అధికారుల దృష్టికి రావడంతో అతడి నుంచి మొబైల్ స్వాధీనం చేసుకున్నారు.

Also Read: లాక్‌డౌన్‌ అతిక్రమించి కారులో షికార్లు.. నకిలీ ఐఏఎస్ అధికారి అరెస్ట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.