యాప్నగరం

ఆ లాంచీకి టూరిజం శాఖ అనుమతి లేదు: మంత్రి అవంతి

గోదావరి నదిలో మునిగిన లాంచీకి పర్యాటక శాఖ అనుమతి లేదని ఆ శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. లాంచీ యజమాని కాకినాడ పోర్టు అధికారుల నుంచి అనుమతులు తెచ్చుకున్న లాంచీని తిప్పుతున్నాడని వెల్లడించారు.

Samayam Telugu 15 Sep 2019, 3:14 pm
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో ఆదివారం పర్యాటకుల లాంచీ మునిగిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ అవంతి శ్రీనివాస్ స్పందించారు. గోదావరిలో లాంచీ తిరిచేందుకు పర్యాటక శాఖ ఎలాంటి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. కాకినాడ పోర్టు అధికారుల నుంచి అనుమతి తీసుకుని లాంచీని తిప్పుతున్నారని తెలిపారు.
Samayam Telugu pjimage (3)


Also Read: గోదావరిలో లాంచీ మునక .. 15 మంది సేఫ్, 47 మంది గల్లంతు

గల్లంతైన వారి కోసం సహాయచర్యలు కొనసాగుతున్నాయని, రెస్క్యూ ఆపరేషన్ కోసం రెండు లాంచీలు పంపాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.

తూర్పుగోదావరి జిల్లాలో దేవీపట్నం మండలంలో గోదావరి నదిలో ఆదివారం పర్యాటకులతో వెళ్తున్న లాంచీ మునిగిపోయింది. గండిపోచమ్మ ఆలయం నుంచి పాపికొండలకు వెళ్తున్న సమయంలో లాంచీ అదుపుతప్పి నదిలో మునిగిపోయింది. మంటూరు-కచ్చలూరు గ్రామాల మధ్య ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బోటులో 62 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 51 మంది ప్రయాణికులు ఉండగా.. మిగిలిన వారంతా సిబ్బంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.