యాప్నగరం

పంజాబ్‌: 83కి చేరిన మృతులు.. కల్లోలం సృష్టిస్తోన్న కల్తీ మద్యం

పంజాబ్‌లో కల్తీ మద్యం మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఒక్కరోజులోనే 60కి పైగా మరణాలు చోటుచేసుకోవడం కలవరపాటుకు గురిచేస్తోంది.

Samayam Telugu 1 Aug 2020, 10:48 pm
పంజాబ్‌లో కల్తీ మద్యం కల్లోలం సృష్టిస్తోంది. కల్తీ మద్యం తాగి జనం భారీగా మృత్యువాతపడుతున్నారు. శుక్రవారానికి 21 మంది చనిపోగా.. శనివారానికి ఆ సంఖ్య గణనీయంగా పెరిగి 86కి చేరింది. అమృత్‌సర్, తర్ణ్ తారణ్, గురుదాస్‌పూర్ జిల్లాల్లో కల్తీ మద్యం మరణాలు సంభవిస్తున్నాయి. బుధవారం నుంచే కలుషిత మద్యం కారణంగా మరణాలు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంకా పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
toxic liquor


ఈ ఘటనను పంజాబ్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. సమగ్ర విచారణ జరిపించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఇప్పటికే మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. చనిపోయిన వారి కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అక్రమ మద్యం తయారీపై దాడులు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అక్రమ మద్యం తయారీ కేంద్రాలపై అధికారులు దాడులు చేస్తున్నారు. మూడు జిల్లాల పరిధిలో వందకి పైగా అక్రమ మద్యం తయారీ కేంద్రాలపై దాడులు చేసినట్లు తెలుస్తోంది.

Also Read: భార్యపై స్నేహితులతో గ్యాంగ్‌ రేప్.. భర్తే దగ్గరుండి మరీ దుర్మార్గం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.