యాప్నగరం

వికారాబాద్‌: టీఆర్ఎస్ నేత దారుణ హత్య.. అఫైర్ కొంప ముంచిందా?

అధికార పార్టీ టీఆర్ఎస్‌కు చెందిన నాగరాజ్ గౌడ్ అనే నాయకుడిని దుండగులు దారుణంగా చంపేశారు. అక్రమ సంబంధమే కారణమని పోలీసులు తెలిపారు.

Samayam Telugu 21 Aug 2020, 3:53 pm
వికారాబాద్ జిల్లా తాండూరులో టీఆర్ఎస్ నేత నాగరాజ్ గౌడ్(50) దారుణ హత్యకు గురయ్యాడు. కొడంగల్‌కు చెందిన నాగరాజ్ వారం రోజుల క్రితం కనిపించకుండా పోయాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయన కోసం గాలింపు చేపట్టారు. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా అతడిని హత్య చేసినట్లు అంగీకరించారు.
Samayam Telugu నాగరాజ్ గౌడ్(ఫైల్ ఫోటో)


Also Read: ముగ్గురిని పెళ్లాడిన కానిస్టేబుల్.. రెండో భార్య ఫిర్యాదుతో కటకటాల్లోకి

నాగరాజ్‌ను చంపేసి తాండూరులోని గొల్ల చెరువులో పడేసినట్లు నిందితులు చెప్పడంతో పోలీసులు ఆ ప్రాంతంలో మృతదేహం కోసం గాలిస్తున్నారు. నాగరాజు హత్యకు అక్రమ సంబంధమే కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Also Read: లేడీ డాక్టర్ అఘాయిత్యం.. భర్త, పిల్లలకు మత్తుమందిచ్చి ఆత్మహత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.