యాప్నగరం

అమెజాన్‌ కంపెనీలో ఉద్యోగుల ఘర్షణ.. కోమాలోకి వెళ్లిపోయిన యువకుడు

శివరాం అమెజాన్ టోలిచౌకి బ్రాంచ్‌‌లో పనిచేస్తున్నాడని, నవంబర్ 20న ఆఫీసులో జరిగిన గొడవలో మునీర్‌పై తనపై అకారణంగా దాడి చేశాడని బాధితుడి చెల్లి మీడియాకు తెలిపారు.

Samayam Telugu 5 Dec 2019, 2:58 pm
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ హైదరాబాద్ కార్యాలయంలో కలకలం రేగింది. ఆ కంపెనీలో పనిచేసే శివరాం, మునీర్ అనే ఉద్యోగులు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో తీవ్రంగా గాయపడిన శివరాం కోమాలోకి వెళ్లిపోయాడు. అతడిని సహోద్యోగులు వెంటనే యశోద ఆస్పత్రికి తరలించారు.
Samayam Telugu amaz



Also Read: ఉన్నావో: గ్యాంగ్ రేప్ బాధితురాలికి నిప్పంటించిన నిందితులు

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న గోల్కొండ పోలీసులు మునీర్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే అతడికి బెయిల్ లభించడంతో వెంటనే బయటకు వచ్చేశాడు. మరోవైపు ఆస్పత్రిలో ఉన్న శివరాం ట్రీట్‌మెంట్ ఖర్చులన్నీ సంస్థే భరించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. తోటి ఉద్యోగిపై దాడికి పాల్పడిన మునీర్‌ను ఉద్యోగం నుంచి తొలగించాలని శివరాం కుటుంబసభ్యులు యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నారు. క్రమశిక్షణగా ఉండాల్సిన ఉద్యోగులు ఘర్షణ పడిన ఘటనపై అమెజాన్ సంస్థ తీవ్రంగా పరిగణిస్తోంది.

Also Read: ఇంట్లోకి చొరబడి.. నోట్లో గుడ్డలు కుక్కి.. గుంటూరులో వివాహితపై అత్యాచారం

తన అన్నయ్య శివరాం అమెజాన్ టోలిచౌకి బ్రాంచ్‌‌లో పనిచేస్తున్నాడని, నవంబర్ 20న ఆఫీసులో జరిగిన గొడవలో మునీర్‌పై తనపై అకారణంగా దాడి చేశాడని బాధితుడి చెల్లి మీడియాకు తెలిపారు. దీంతో తాము మునీర్, అమెజాన్ సంస్థపై గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

Also Read: పక్కింటి బాలికను యాదాద్రి తీసుకెళ్లి లాడ్జిలో అత్యాచారం.. రెండో పెళ్లికి ఒత్తిడి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.