యాప్నగరం

కస్టమర్ ఇంట్లో సెక్స్ వర్కర్స్ దోపిడీ.. డబ్బులు ఎగ్గొట్టడంతో..

తన ఫ్లాట్‌లో చోరీ చేశారంటూ కంపెనీ ఓనర్ ఇద్దరిపై ఫిర్యాదు చేశాడు. అయితే వారిని గాలించి పట్టుకున్న పోలీసులకు షాకింగ్ విషయం తెలిసింది. వారిద్దరూ మగ వ్యభిచారులని.. (మేల్ సెక్స్ వర్కర్స్)..

Samayam Telugu 11 Sep 2020, 2:40 pm
తన ఇంట్లో ఇద్దరు యువకులు దొంగతనం చేశారని ఓ కంపెనీ ఓనర్ పోలీసులను ఆశ్రయించాడు. చోరీ కేసు నమోదు చేసిన పోలీసులు సెల్‌ఫోన్ లొకేషన్ ట్రేస్ చేసి ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. అసలు దొంగతనం ఎందుకు చేశారని విచారించడంతో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. కంపెనీ ఓనర్ శృంగార లీలల గుట్టురట్టైంది. శృంగారం కోసం తమను బుక్ చేసుకుని డబ్బులివ్వకపోవడంతోనే దొంగతనం చేసినట్లు చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
male sex workers


ఢిల్లీకి చెందిన శంకర్(పేరుమార్చాం) గత నెల 30న తన ఫ్లాట్‌లో ఇద్దరు దొంగలు చోరీకి పాల్పడ్డారని.. తన రెండు మొబైల్ ఫోన్లు, రూ.42 వేల నగదు దొంగిలించారని ఫిర్యాదు చేశాడు. తన బంధువుల ఇంట్లో రవి(పేరుమార్చాం) అనే వ్యక్తి కలిశాడని.. ఉద్యోగం లేదని చెప్పడంతో తన కంపెనీకి రావాలని చెప్పానన్నాడు. మరుసటి రోజు ఉదయం రవి, అతని స్నేహితుడు సునీల్(పేరుమార్చాం) తన వద్దకు వచ్చారని.. కంపెనీ డీలర్‌షిప్ తీసుకునేందుకు రవి ఆసక్తి చూపినట్లు చెప్పాడు. తన బంధువు ఒకరు డీలర్‌షిప్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాడంటూ స్నేహితులిద్దరూ తన ఫ్లాట్‌కి వచ్చారని.. తాను బట్టలు మార్చుకునే సమయంలో తనపై దాడి చేసి సెల్‌ఫోన్లు నగదు దోచుకెళ్లారంటూ ఢిల్లీ పోలీసులకు శంకర్ ఫిర్యాదు చేశాడు.

Also Read: భార్యని స్నేహితుల దగ్గరికి.. కీచక భర్త ఘాతుకం
శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్ డేటా ఆధారంగా నిందితులను గాలించి పట్టుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని తమ స్టైల్లో విచారించడంతో విస్తుపోయే వాస్తవాలు వెల్లడించారు. తాము మగ వ్యభిచారులమని.. శంకర్ తమ కస్టమర్ అని చెప్పడంతో కంపెనీ ఓనర్ బాగోతం బట్టబయలైంది. తమను శృంగారం కోసం బుక్ చేసుకుని.. పని అయిపోయాక డబ్బులివ్వకపోవడంతో చోరీ చేసినట్లు చెప్పడంతో పోలీసులు విస్తుపోయారు. గతంలోనూ తమకు బాకీ ఉన్నాడని.. డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడంతోనే దొంగతనం చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు.

Read Also:
కొడుకుతో కోడలు సెక్స్ చేయకూడదట! అడ్డుపడుతున్న మామ.. చివరికి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.