యాప్నగరం

ప్రేమన్నాడు.. పెళ్లికి ముందే తల్లిని చేశాడు... నెల్లూరు యువకుడిపై కేసు

పెళ్లి చేసుకుంటానని విజయవాడ యువతిని నమ్మించిన నెల్లూరుకు చెందిన షఫీ ఆమెపై చాలాసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. గర్భం దాల్చడంతో ఆమె నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు.

Samayam Telugu 3 Mar 2020, 11:27 am
ప్రేమ పేరుతో యువతిని లొంగదీసుకుని గర్భవతిని చేసిన యువకుడిపై విజయవాడ కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలం యలమర్రు గ్రామానికి చెందిన యువతి విజయవాడ సూర్యారావుపేటలోని ఓ ఓల్డేజ్‌ హోమ్‌లో పనిచేస్తోంది. ఏడాది కిందట ఓ వృద్ధురాలికి సేవలందించే నిమిత్తం ఓల్డేజ్‌ హోమ్‌ నిర్వాహకులు ఆమెను నెల్లూరు నగరానికి పంపించారు.
Samayam Telugu 1513570490-173


Also Read:ఆఫర్లు లేక.. భర్తతో వేగలేక తమిళనటి ఆత్మహత్య.. కన్నీరు పెట్టిస్తున్న ఆఖరి వీడియో

అక్కడ షేక్‌ షఫీ అనే వ్యక్తి ఆమెకు పరిచయమై కొంతకాలానికి దగ్గరయ్యాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి వెంట తిరిగాడు. మూడు నెలల తర్వాత ఆమె విజయవాడ వచ్చేయగా.. షఫీ తరచు విజయవాడ వచ్చి ఓ హోటల్‌లో గదిని అద్దెకు తీసుకుని ఆమెతో గడిపేవాడు. ఫలితంగా ఆమె గర్భం దాల్చడంతో ప్రియుడికి ఫోన్ చేసి చెప్పింది. త్వరలోనే పెళ్లి చేసుకుందామని చెప్పి షఫీ తర్వాత ఫోన్ లిఫ్ట్ మానేశాడు.

Also Read: పగలు రూ.6వేలు... రాత్రి రూ.15వేలు.. హైటెక్ సెక్స్‌రాకెట్‌ గుట్టురట్టు

ప్రియుడి ఎడబాటుతో మనస్తాపానికి గురైన యువతి ఫిబ్రవరి 14న విజయవాడ బస్‌స్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని గమనించిన పోలీసులు దిశ వన్‌స్టాప్ సెంటర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో వారు యువతి వివరాలు సేకరించి గూడవల్లిలోని రెస్య్యూ హోమ్‌కు తరలించారు. అక్కడే 27వ తేదీన ఆమెకు ఫిట్స్‌ రావడంతో నిర్వాహకులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాధితురాలు మృత శిశువును ప్రసవించింది. అవుట్‌పోస్ట్‌ పోలీసులు ద్వారా వచ్చిన ఫిర్యాదు ఆధారంగా కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. షఫీ ఆచూకీ కోసం నెల్లూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Also Read: అక్క భర్తతో వివాహం.. ప్రియుడితో సహజీవనం.. చివరికి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.