యాప్నగరం

అన్నదమ్ముల ఆస్తి తగాదా.. మధ్యవర్తిగా వెళ్లిన సర్పంచ్ దారుణహత్య

ఆస్తి పంపకాల్లో తేడా రావడంతో తమ్ముడు దేవరాజ్‌ మాఝి అన్న సుధీర్‌పై గొడ్డలితో దాడికి యత్నించాడు. అతడిని అడ్డుకునేందుకు యత్నించిన గ్రామ సర్పంచ్ రామ్‌ హరిజన్‌ హత్యకు గురయ్యాడు.

Samayam Telugu 31 Jan 2020, 12:44 pm
సమాజంలో పెద్ద మనిషిగా గౌరవం ఉన్నప్పటికీ కొన్ని వివాదాల్లో తలదూర్చకపోవడమే మంచిది. ఇలాగే అన్నదమ్ముల మధ్య జరుగుతున్న ఆస్తి తగాదాను పరిష్కరించేందుకు ప్రయత్నించి గ్రామ సర్పంచి ఏకంగా ప్రాణాలే కోల్పోయాడు. ఈ ఘటన ఒడిశాలోని నవరంగ్‌పూర్ జిల్లాలో బుధవారం రాత్రి జరిగింది.
Samayam Telugu murder


Also Read: వివాహితపై యువకుడి అఘాయిత్యం.. రాజీ కోసం రంగంలోకి దిగిన నేతలు

నవరంగపూర్‌ జిల్లా ఝరిగాం సమితి ఇచ్ఛాపూర్‌ పంచాయతీ కదామలి గ్రామానికి చెందిన సుధీర్‌ మాఝి, దేవరాజ్‌ మాఝిలు అన్నదమ్ములు. వీరిద్దరి మధ్య కొద్దిరోజులుగా ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. బుధవారం ఆస్తిపంపకాల సమస్య తీర్చేందుకు ఇద్దరు అన్నదమ్ములూ సర్పంచి రామ్‌ హరిజన్‌ను ఇంటికి పిలిచారు. సర్పంచి ఇద్దరి మధ్య ఆస్తి పంపకాలు చేశాడు. ఇందులో తనకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ దేవరాజ్‌ మాఝి అన్న సుధీర్‌పై దాడికి యత్నించగా సర్పంచి అడ్డుకున్నాడు.

Also Read: హైదరాబాద్ వ్యాపారికి సైబర్ షాక్.. లండన్ నుంచి రూ.15లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

దీంతో ఆగ్రహం చెందిన దేవరాజ్‌ గొడ్డలితో ఆయనపై మెడపై నరికి పరారయ్యాడు. తీవ్రగాయాలైన సర్పంచి అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో జోరిగాం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

Also Read: లిస్బన్‌ పబ్‌లో లైంగిక వేధింపుల కేసు... ఫ్లేటు ఫిరాయించిన బాధితురాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.