యాప్నగరం

విశాఖలో రౌడీషీటర్ల హల్‌చల్.. బర్త్‌ డే పార్టీ పేరుతో మందు, విందు

విశాఖ జిల్లా అనకాపల్లిలో రౌడీషీటర్లు పుట్టినరోజు వేడుకల పేరుతో హల్‌ చేశారు. మద్యం తాగుతూ, బిర్యానీ తింటూ రచ్చ రచ్చ చేశారు. పోలీసులు అక్కడికి చేరుకునే సరికే అందరూ పరారయ్యారు.

Samayam Telugu 16 Jul 2020, 4:59 pm
విశాఖ నగరంలో రౌడీషీటర్లు మరోసారి రెచ్చిపోయారు. నగరానికి చెందిన ఓ ప్రముఖ రౌడీ పుట్టినరోజు వేడుకల్లో హంగామా సృష్టించారు. అనకాపల్లి శివారులోని తోటల్లో సుమారు 30 మంది రౌడీషీటర్లు గుమిగూడారు. విందు, వినోదాలతో చెలరేగిపోయారు. పక్కా సమాచారం అందడంతో ఎస్పీ కృష్ణారావు తన సిబ్బందిని అప్రమత్తం చేశారు.
Samayam Telugu Image


Also Read: క్వారంటైన్ కేంద్రంలో కామాంధుడు.. చికిత్స కోసం వచ్చిన బాలికపై రేప్

దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో తనిఖీ చేపట్టేందుకు బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న రౌడీషీటర్లు అక్కడి నుంచి పరారయ్యారు. సంఘటనా స్థలంలో బిర్యానీ తిని పడేసిన ప్లేట్లు, మద్యం సీసాలు లభించాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ఎలాంటి సమావేశాలు, పార్టీలు నిర్వహించొద్దని హెచ్చరిస్తున్నా రౌడీషీటర్లు ఇలా పార్టీ చేసుకోవడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం గాజువాకలో ఇలాగే పార్టీ చేసుకున్న చిట్టిమాము గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా అనేక నేరాలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

Also Read: అజయ్‌, శ్రావణిల ప్రేమకథ విషాదాంతానికి కారణం అదే

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.