యాప్నగరం

ప్రియురాలు పెళ్లికి నిరాకరించిందని.. యువకుడి ఆత్మహత్య!

ప్రియురాలు పెళ్లికి నిరాకరించిందనే మనస్తాపంతో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది.

Samayam Telugu 28 Dec 2019, 3:56 pm
ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిందనే మనస్తాపంతో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో శనివారం ఈ ఘటన వెలుగుచూసింది. జిల్లాలోని తాళ్లపూడికి చెందిన ఇర్లపాటి నవీన్‌ (28) గత కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఇటీవల వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి.
Samayam Telugu naveen


Also Read: ప్రముఖ టీవీ యాంకర్ భర్త ఆత్మహత్య! అక్రమ సంబంధమే కారణమా?

దీంతో రెండు రోజుల క్రితం హైదరాబాద్‌ వెళ్లిన నవీన్‌ శుక్రవారం ఉదయం ఊరికి తిరిగొచ్చాడు. అనంతరం గోదావరి గట్టు వద్దకు వెళ్లి.. అక్కడ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీన్ని స్థానికులు గమనించి నవీన్‌ను చికిత్స నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడం వల్లే నవీన్‌ మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిసింది. నవీన్‌ తన మొబైల్‌లో “తాను మోసపోయానని.. ఇకపై ఎవరినీ ఇలా మోసం చేయవద్దు’’ అని రాసుకున్నాడు. అయితే నవీన్‌ మృతికి పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. నవీన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాళ్లపూడి ఎస్సై జి.సతీష్‌ చెప్పారు.

Also Read: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని! శిక్ష ఖరారు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.