యాప్నగరం

కళ్లలో కారం కొట్టినా వదలని మహిళ.. చిన్న ముక్కతోనే చైన్ స్నాచర్ పరారీ

ఆమె కన్నెత్తి చూసేలోపే కళ్లలో కారం కొట్టాడు. దొంగతనం సులువైందనుకునేలోపే మహిళ తీవ్రంగా ప్రతిఘటించింది. చివరికి చైన్ స్నాచర్ పరిగెత్తాల్సి వచ్చింది.

Samayam Telugu 22 Jan 2020, 5:15 pm
ఓ మహిళ నిత్యం ఆలయానికి రావడం గమనించిన చైన్ స్నాచర్ దోపిడీకి పథకం రచించాడు. సరిగ్గా ఆమె పూజ చేసుకుంటున్న సమయంలో దగ్గరికెళ్లాడు. ఎదురుపడిన వ్యక్తిని ఆమె కన్నెత్తి చూసేలోపే కళ్లలో కారం కొట్టాడు. ఇంకేముంది పని సులువైపోయిందనుకున్నాడు. అయితే అక్కడే ట్విస్ట్ చోటుచేసుకుంది. కారం కొట్టినా మహిళ బంగారాన్ని వదల్లేదు. తీవ్రంగా పోరాడి చైన్ స్నాచర్‌ను పరిగెత్తించింది. వీరోచితంగా పోరాడి దోపిడీ నుంచి మహిళ తప్పించుకున్న ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది.
Samayam Telugu chilly-powder


ఉదయగిరి పట్టణంలోని స్టేట్‌పేటకు చెందిన రెడ్డమ్మ రోజు మాదిరిగానే పూజలు చేసేందుకు పట్టణ శివారులో వెలసిన నాగరప్పమ్మ ఆలయానికి వెళ్లింది. అది గమనించిన ఆగంతకుడు ఒక్కసారిగా ఆమె వద్దకు వచ్చాడు. అతనిని చూసే లోపే ఆమె కళ్లలో కారం చల్లాడు. మెడలోని బంగారు గొలుసులను తెంపుకెళ్లేందుకు ప్రయత్నించాడు.

Also Read: చేతబడి కోసం గూగుల్‌లో సెర్చ్.. అడ్డంగా బుక్కైన హైదరాబాద్ యువతి

రెడ్డమ్మ తీవ్రంగా ప్రతిఘటించడంతో కొద్దిసేపు పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో రెండు గొలుసులు తెగిపోయాయి. ఒక గొలుసు చేజారి కిందపడిపోయింది. మరో గొలుసు తెగిపోయి ఒక ముక్క మాత్రమే దొంగ చేతికి దొరికింది. మహిళ తీవ్రంగా ప్రతిఘటించడంతో బిత్తరపోయిన చైన్ స్నాచర్.. దొరికిన చైను ముక్కతోనే పరారయ్యాడు. అక్కడి నుంచి పరుగులు తీశాడు. రెడ్డమ్మ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Read Also: కన్నకొడుకు ముందే తల్లిపై అత్యాచారం.. ప్రైవేట్ పార్ట్స్‌ను కత్తితో దారుణంగా..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.