యాప్నగరం

స్నేహితుడి భార్యపై కన్నేసిన కామాంధుడు.. పక్కా ప్లాన్‌తో చంపి శవాన్ని ముక్కలు చేసిన భార్యాభర్తలు

తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని స్నేహితుడి భార్యను ఏడాది పాటు వేధింపులకు గురిచేశాడు. అతడి ఆగడాలను ఆమె భరించింది. ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో బుద్ధి మార్చుకోవాలని స్నేహితుడ్ని హెచ్చరించాడు. అయినా, అతడు మారకపోవడంతోపథకం ప్రకారం అతడ్ని ఇంటికి పిలిపించి హతమార్చారు. అనంతరం ఇద్దరూ కలిసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కాల్వలో విసిరేశారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జనవరి 21న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 30 Mar 2023, 4:58 pm

ప్రధానాంశాలు:

  • వివాహేతర సంబంధం పెట్టుకోవాలని వేధింపులు
  • స్నేహితుడు హెచ్చరికలు పట్టించుకోని పఠాన్
  • ఇంటికి రప్పించి కళ్లకు గంతలుకట్టి హత్య
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu mehraz Pathan
స్నేహితుడి భార్యపై కన్నేసిన ఓ కామాంధుడు... తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని ఆమెను వేధింపులకు గురిచేశాడు. అతడి ఆగడాలను ఏడాది పాటు భరించిన బాధితురాలు.. భర్తకు ఈ విషయం చెప్పి పథకం ప్రకారం అతడ్ని ఇంటికి పిలిపించి హతమార్చింది. అనంతరం ఇద్దరూ కలిసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కాల్వలో విసిరేశారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జనవరి 21న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులైన భార్యాభర్తలను పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
పోలీసుల కథనం ప్రకారం.. అహ్మదాబాద్‌లోని బాపూనగర్‌కు చెందిన ఇమ్రాన్ (28), రిజ్వానా సయ్యద్ (27) భార్యాభర్తలు. ఇమ్రాన్ స్నేహితుడు 40 ఏళ్ల మెహ్రాజ్ పఠాన్ ఏడాది నుంచి రిజ్వానా వెంటబడుతున్నాడు. తనతో సంబంధం పెట్టుకోవాలన్న అతడి వేధింపులను మౌనంగా భరించింది. చివరకు ఈ విషయం గురించి భర్తకు రిజ్వానా చెప్పడంతో.. తన స్నేహితుడ్ని హెచ్చరించాడు. అయినా సరే పఠాన్‌ వాటిని పెడచెవిపెట్టాడు. రోజు రోజుకూ మితిమీరిపోవడంతో చివరకు అంతం చేయాలని భార్యాభర్తలు నిర్ణయించుకున్నారు.

జనవరి 21 రాత్రి పఠాన్‌కు ఫోన్ చేసిన రిజ్వానా.. ఇంటికొస్తే నీకో సర్‌ప్రైజ్ ఇస్తానని పిలిపించింది. ఇంటికి వచ్చిన అతడికి కళ్లకు గంతలు కట్టి కట్టడానికి అనుమతిస్తే సర్‌ప్రైజ్ ఇస్తానని నమ్మించింది. అవకాశం కోసం ఎదురుచూస్తోన్న పఠాన్.. ఇది నిజమేనని భావించి ఆమె చెప్పినట్టు చేశాడు. ఈ సమయంలో అదును చూసి ఇమ్రాన్ కత్తితో పొడిచాడు. అతడు చనిపోయిన తర్వాత మృతదేహం తల, మొండెం వేరుచేసి ఖారికట్ కాల్వలో పడేశాడు. పఠాన్ కళ్లకు చున్నీతో కట్టి, కాళ్లుచేతులను బెడ్‌షీట్‌తో కదలకుండా కట్టేసింది. గదిలోకి పదునైన కత్తితో వెళ్లిన ఇమ్రాన్.. అతడి పొట్టలో పలుసార్లు పొడిచి చంపేశాడు.

‘అదే రోజు రాత్రి భార్యాభర్తలు మృతదేహాన్ని నరికి, తలను డబ్బాలో పడేశారు. మరుసటి రోజు ఉదయం ఇమ్రాన్ శరీర భాగాలను గోనె సంచిలో వేసి కాలువలో పడేశాడు’ అని పోలీసులు తెలిపారు. జనవరి 21 రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన పఠాన్ రాకపోవడంతో మర్నాడు అతడి తల్లి షకీనా, సోదరుడు ఇమ్రాన్ సలీంలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

పఠాన్ తరచుగా ఇమ్రాన్‌తో తిరుగుతున్నట్లు పోలీసులకు తెలిసింది. రిజ్వానాపై అతడికి ఉన్న వ్యామోహం గురించి ఇమ్రాన్‌కు తెలిసి చాలాసార్లు బెదిరించాడని, తన భార్యకు దూరంగా ఉండాలని హెచ్చరించినట్లు పఠాన్ కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. దీంతో భార్యాభర్తలను అదుపులోకి తీసుకుని విచారించడంతో హత్య చేసినట్టు వెల్లడయ్యింది. ఇరువురిపై హత్య, సాక్ష్యాలను నాశనం చేయడం, నేరపూరిత కుట్ర, ఉమ్మడి ఉద్దేశంతో చేసిన చర్యలపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదుచేసి, అరెస్ట్ చేశారు.

Read More Latest Crime News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.