యాప్నగరం

ప్రేమోన్మాది వేధింపులకు యువతి బలి.. కడపలో విషాదం

ప్రేమ పేరుతో వెంటపడుతున్నాడు. తల్లిదండ్రులు కూడా మందలించడంతో దారుణ నిర్ణయం తీసుకుంది. ఉరి వేసుకుని అర్ధాంతరంగా తనువు చాలించింది. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది.

Samayam Telugu 5 Mar 2020, 3:23 pm
టీచర్ ఉద్యోగం సాధించి కన్నవారి కష్టాలు తీరుద్దామని భావించిన ఓ యువతి అర్ధాంతరంగా తనువు చాలించింది. ప్రేమోన్మాది వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడి కన్నవారికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఇంట్లో వాళ్లకి చెప్పినా తననే మందలించడంతో కుంగిపోయింది. దానికితోడు ప్రేమ పేరుతో వేధింపులు ఎక్కువవడంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద సంఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది.
Samayam Telugu death


పోరుమామిళ్ల మండలంలోని అక్కలరెడ్డి పల్లెకి చెందిన వెంకటయ్య, కుమారి దంపతుల పెద్దకుమార్తె శాంతిప్రియ టీచర్ ట్రైనింగ్ చేస్తోంది. ఆమె కాలేజీకి వెళ్లి వచ్చే సమయంలో అదే గ్రామానికి చెందిన ఓబుళాపురం ఓబులేసు అనే వ్యక్తి ప్రేమపేరుతో వేధింపులకు పాల్పడుతున్నాడు. నిత్యం దారి వెంట కాపుకాసి ఈవ్‌టీజింగ్ చేస్తుండడంతో ఆమె విసిగిపోయింది.

Also Read: మూడు రోజులుగా బంధించి యువతిపై రేప్.. సిగరెట్లతో కాల్చి నరకం.. హైదరాబాద్‌లో దారుణం

కాలేజీకి వెళ్తున్న సమయంలో ఓబులేసు తనను వేధిస్తున్నాడని శాంతిప్రియ తల్లిదండ్రులకు చెప్పినా పట్టించుకోలేదు. తిరిగి ఆమెనే మందలించడంతో శాంతిప్రియ కుంగిపోయింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: వదిన బట్టలూడదీసి చిత్రహింసలు.. మరుదులు, తమ్ముడి ఘాతుకం..

ఓబులేసు వేధింపుల కారణంగానే తమ కూతురు బలవన్మరణానికి పాల్పడిందని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అతను వేధిస్తున్నాడని చెప్పినా ఆమెనే మందలించామని.. అయినా ఓబులేసు ప్రవర్తన మార్చుకోలేదన్నారు. తమ ఇంటిపై దాడి చేసి కత్తితో బెదిరింపులకు పాల్పడడంతో భయపడిపోయిన శాంతిప్రియ ఆత్మహత్య చేసుకుందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇంతలోనే దుర్మార్గుడు పొట్టన పెట్టుకున్నాడని కన్నీరు మున్నీరుగా విలపించారు.

Also Read : లేడీ డాక్టర్‌పై అత్యాచారం.. బాత్రూమ్‌‌లో ఉండగా వీడియో తీసి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.