యాప్నగరం

తెలంగాణ టు తిరుపతి.. పెళ్లైన ఆర్నెళ్లకే యువతి ఆత్మహత్య

ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడి కోసం రాష్ట్రం దాటి వచ్చేసింది. పెళ్లై ఆర్నెల్లు తిరక్కుండానే ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు అంత కష్టం ఏమొచ్చింది?

Samayam Telugu 5 Jul 2020, 1:28 pm
యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. రాష్ట్రం దాటి వచ్చి మరీ కాపురం పెట్టింది. ఏమైందో ఏమో తెలియదు సడెన్‌గా శవమై తేలింది. ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పెళ్లై ఆర్నెల్లు తిరక్కుండానే యువతి బలవన్మరణానికి పాల్పడడం పలు అనుమానాలకు తావిస్తోంది. భర్త వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుందా? లేక మరేమైన కారణాలున్నాయా? ఈ విషాద సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
suicide


తిరుపతికి చెందిన గురునాథం ఓ పురుగు మందుల కంపెనీలో పనిచేసేవాడు. ఉద్యోగంలో భాగంగా తెలంగాణలోని హన్మకొండలో ఉండేవాడు. ఆ సమయంలో అదే ప్రాంతానికి చెందిన సునీతతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. కొన్నాళ్ల తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకుకోవాలని నిర్ణయించుకున్నారు. మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అనంతరం గురునాథం తన సొంత ఊరుకి వచ్చేశాడు. ఇద్దరూ కలసి తిరుచానూరు సమీపంలోని అవిలాల పంచాయతీ ఎంకేనాయుడు కాలనీలో కొత్త కాపురం పెట్టారు.

Also Read:
కూతురి న్యూడ్ ఫొటోలతో బ్లాక్‌మెయిల్.. అడ్డంగా బుక్కైన కీచకులు

అంతా సాఫీగా సాగిపోతుందనుకున్న సమయంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. సడెన్‌గా సునీత ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఆమె ఆత్మహత్య చేసుకోవాల్సినంత బలమైన కారణాలేమై ఉంటాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Read Also: మహిళను చంపి శవంతో శృంగారం.. కామపిశాచి పైశాచికం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.