యాప్నగరం

అల్లుడితో అక్రమ సంబంధం.. భర్తకు తెలిసిపోవడంతో ఇద్దరూ కలిసి

అల్లుడితో కొనసాగిస్తున్న అక్రమ సంబంధం తెలిసిపోవడంతో ఆందోళన చెందిన వివాహిత ప్రియుడితో కలిసి పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

Samayam Telugu 19 Jul 2020, 10:37 am
అల్లుడి వరుసయ్యే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వివాహిత ఆ విషయం భర్తకు తెలిసిపోయిందన్న ఆందోళనతో ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలోని వనపర్తి జిల్లాలో వెలుగుచూసింది. మదనాపురం మండలం భౌసింగ్‌తండా పంచాయతీ పరిధిలోని స్కూలుగుట్ట తండాకు చెందిన దేవమ్మ(30)కు అదే ప్రాంతానికి చెందిన రాజుతో పదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. రాజు బుల్డడోజర్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
Samayam Telugu దేవమ్మ, శివనాయక్(ఫైల్ ఫోటోలు)


Also Read: ఆఫీసులోనే మహిళపై అత్యాచారయత్నం, హత్య.. హైదరాబాద్‌లో ఘోరం

ఈ క్రమంలోనే దేవమ్మ మేనల్లుడి వరుసయ్యే శివ నాయక్(20) అనే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త లేని సమయంలో శివను ఇంటికే పిలిపించుకుని రాసలీలలు కొనసాగించేది. ఈ క్రమంలోనే శుక్రవారం ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో రాజు ఇంటికి రావడంతో వారి బండారం బయటపడింది.

Also Read: భార్య చేయి పట్టుకున్నాడని హత్య.. విజయనగరంలో దారుణం

దీంతో ఆందోళన చెందిన ఇద్దరూ మండలంలోని దుప్పల్లి గ్రామ శివారు కొన్నూరు క్రాస్‌ రోడ్డు వద్దకు చేరుకున్నారు. పెద్దతొక్కుడోని బండపై పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అంతకుముందే శివనాయక్‌ తన తండ్రికి ఫోన్‌ చేసి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సమాచారం ఇచ్చారు. ఆందోళనకు గురైన ఆయన వెంటనే దుప్పల్లికి చేరుకొని చూడగా అప్పటికే ఇద్దరు ఆపస్మారక స్థితిలో పడి ఉన్నారు.

Also Read: సెల్‌ఫోన్ వాడొద్దన్న తల్లిదండ్రులు.. ఉరేసుకుని యువతి ఆత్మహత్య

స్థానికుల సాయంతో ఆ ఇద్దరిని 108 వాహనంలో వనపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ దేవమ్మ చనిపోయింది. శివనాయక్‌ పరిస్థతి విషమంగా ఉండటంతో మహబూబ్‌నగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి ఒంటి గంటకు ప్రాణాలు కోల్పోయాడు. పంచనామా నిర్వహించిన అనంతరం పోలీసులు ఇద్దరి మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. రెండు కుటుంబాల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read: కొంపముంచిన షేర్‌‌చాట్ లవ్... యువతిని అడవిలో బంధించి ఐదురోజులు రేప్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.