యాప్నగరం

నా బిడ్డకు తండ్రి ఎస్‌ఐ జగదీశ్ ... కాావాలంటే డీఎన్‌ఏ పరీక్ష చేసుకోండి

పెళ్లి చేసుకుంటానని తనను శారీరకంగా లోబరుచుకున్న ఎస్ఐ జగదీశ్ తల్లిని చేశాడని, కేసు పెడితే తనతో పాటు సాక్షులను బెదిరిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Samayam Telugu 7 Jul 2020, 3:48 pm
గుంటూరు జిల్లా ముప్పాళ్ల పోలీస్‌స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న జగదీశ్ తనను శారీరకంగా వాడుకుని తల్లిని చేశాడంటూ గతంలో ఓ యువతి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అతడి బండారాన్ని బయటపెట్టానన్న కక్షతో జగదీశ్ అరాచకాలకు పాలడుతున్నాడని, అతడిపై నమోదై కేసులో సాక్షులను బెదిరిస్తూ కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాడని బాధితురాలు తాజాగా గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ విశాల్ గున్నీకి సోమవారం ఫిర్యాదు చేసింది. ఎస్ఐ జగదీశ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా అనుభవించి ఓ బిడ్డకు తల్లిని చేశాడని నరసరావుపేట పోలీసులకు ఆమె ఈ నెల 2వ తేదీన ఫిర్యాదు చేసింది.
Samayam Telugu Image


Also Read: హిజ్రాలే అతడి లక్ష్యం.. సహజీవనం చేసి సొమ్ముతో ఉడాయిస్తాడు

దీంతో కక్షగట్టిన జగదీశ్ తన మాజీ భర్త పి.సుబ్బారావు పేరును ప్రస్తావిస్తూ ఓ టీవీ ఛానల్‌ ద్వారా అసత్య ప్రచారం చేయిస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తన బిడ్డ ప్రణవ్‌కు జగదీశే తండ్రని, దీన్ని నిరూపించేందుకు డీఎన్ఏ టెస్ట్‌కు కూడా తాను సిద్ధమని స్పష్టం చేసింది. ఈ కేసులో తనకు అండగా నిలిచిన సాక్షులకు అతడు బెదిరింపుకు గురిచేస్తున్నాడని, వారితో పాటు తనకు కూడా ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఎస్పీని వేడుకుంది. దీనిపై స్పందించిన ఎస్పీ.. ఎస్ఐ జగదీశ్‌పై శాఖాపరమైన విచారణ చేపట్టిన చర్యలు తీసుకుంటామన్నారు.

Also Read: న్యూడ్‌ వీడియోలతో ప్రియురాలికి వేధింపులు.. కానిస్టేబుళ్ల అండతో యువకుడి బరితెగింపు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.