యాప్నగరం

ఈదురుగాలులు.. నీటిసుడుల్లో కలిసిపోయిన భార్య.. విశాఖలో విషాదం

కళ్లెదుటే కట్టుకున్న భార్య నీటమునిగి చనిపోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో భర్త ఒడ్డుకు చేరిన విషాద ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది.

Samayam Telugu 10 Apr 2020, 2:57 pm
జలాశయం అవతలి ఒడ్డుకు వెళ్లి తిరిగొస్తుండగా ఒక్కసారిగా ఈదురుగాలులు విరుచుకుపడ్డాయి. భీకర గాలులకు నాటుపడవ కుదుపులకు గురవడంతో దంపతుల గుండెల్లో అలజడి రేగింది. ప్రాణాలు దక్కించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. భార్యను కాపాడుకుందామన్న ఆ భర్త కోరిక నెరవేరలేదు. కళ్లెదుటే ఆమె నీళ్లసుడుల్లో కలిసిపోయింది. ఈతకొట్టుకుంటూ ఎలాగో భర్త ఒంటరిగా ఒడ్డుకు చేరాడు. విశాఖ జిల్లాలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Samayam Telugu konam


తాటికమ్మలు తెచ్చుకునేందుకు జలాశయం దాటి వెళ్లిన భార్యాభర్తలు ఊహించని ప్రమాదంలో చిక్కుకుపోయిన ఘటన కోనాం జలాశయంలో చోటుచేసుకుంది. జలాశయం అవతలి వైపు ఉన్న తాటికమ్మలు తెచ్చుకునేందుకు దారపర్తి కొండలరావు, దేముడమ్మ దంపతులు నాటుపడవలో వెళ్లారు. తాటికమ్మలు సేకరించి పడవలో వేసుకుని తిరిగి వస్తూ ఊహించని ప్రమాదంలో చిక్కుకుపోయారు.

Also Read: చీరకొంగు బిగించి చంపేసి హైడ్రామా.. విజయవాడలో దారుణం.. పోలీసుల ఎంట్రీతో..

జలాశయంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. భయంకరమైన ఈదురుగాలులు వీయడంతో నాటుపడవ కుదుపులకు గురవడంతో దంపతుల్లో అలజడి రేగింది. గాలుల ధాటికి పడవ బోల్తా పడడంతో భార్యాభర్తలు జలాశయంలో పడిపోయారు. నీళ్లలో పడి మునిగిపోతున్న భార్యను కాపాడుకునేందుకు భర్త శాయశక్తులా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. గాలులు విపరీతంగా వీస్తుండడంతో చేసేది లేక తానొక్కడే ఎలాగోలా ఒడ్డుకు చేరుకున్నాడు.

తన భార్య జలాశయంలో నీట మునిగని విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో పోలీసు, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తమయ్యారు. మత్స్యకారులతో గాలింపు చర్యలు చేపట్టారు. దేముడమ్మ మృతదేహం జలాశయంలో పైకి తేలడంతో ఒడ్డుకు చేర్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Read Also: నాన్న ఇక నన్ను చదివించలేడు.. మనస్థాపంతో కూతురి అఘాయిత్యం.. విషాదం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.