యాప్నగరం

ఆపరేషన్‌కి ముందు ఎక్కువైన మత్తు ఇంజెక్షన్.. అనంతలో విషాదం

అనంతపురంలో విషాద ఘటన జరిగింది. థైరాయిడ్ సమస్యతో వచ్చిన వివాహిత మత్తు ఇంజెక్షన్ వికటించి చనిపోయినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.

Samayam Telugu 26 Sep 2020, 5:05 pm
థైరాయిడ్ సమస్యతో ఆస్పత్రికి వచ్చిన మహిళ అనస్తీషియా ఎక్కువై మృతి చెందిన విషాద ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. ఎక్కువ మోతాదులో మత్తు ఇంజెక్షన్ ఇవ్వడంతో వికటించి ఆమె మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తూ ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన చేపట్టారు. శింగనమల మండలం శ్రీపురంకి చెందిన వివాహిత రాధ థైరాయిడ్ సమస్యతో బాధపడుతోంది. అనంతపురంలోని శ్రీనివాస ఆస్పత్రి వైద్యులు ఆపరేషన్ చేయాలని చెప్పడంతో ఆస్పత్రిలో చేరింది. ఆపరేషన్‌కి ముందు అనస్తీషియా ఇంజెక్షన్ ఇచ్చారు. సడెన్‌గా ఆమె పరిస్థితి విషమించి మృతి చెందింది. అధిక మోతాదులో మత్తు ఎక్కించడంతో వికటించి ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధ మృతికి ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
death


Also Read: కన్నతండ్రి గొంతుపై కాలేసి తొక్కిన కర్కోటకులు.. ఆస్తి కోసం అమరావతిలో ఘోరం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.