యాప్నగరం

క్వారంటైన్ కేంద్రంలో మహిళపై గ్యాంగ్‌రేప్.. కరోనా కల్లోలంలోనూ రెచ్చిపోయిన కామాంధులు

ప్రజారవాణా స్తంభించిపోవడంతో నలభై ఏళ్ల మహిళ కాలినడకన సొంతూరికి బయల్దేరింది. దారిలోనే ఆమెను అడ్డగించిన స్థానిక అధికారులు పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. ఒంటరి మహిళను గమనించిన ముగ్గురు యువకులు ఆమెను గ్యాంగ్‌రేప్ చేశారు.

Samayam Telugu 26 Apr 2020, 7:11 pm
లాక్‌డౌన్ కారణంగా కాలినడకన సొంతూరికి బయల్దేరిన మహిళ క్వారంటైన్ కేంద్రంలో గ్యాంగ్‌రేప్‌‌కి గురైన ఘటన రాజస్థాన్‌లో జరిగింది. జైపూర్‌కి చెందిన మహిళ(40) లాక్‌డౌన్‌కి ముందు సవాయ్ మధోపూర్ జిల్లాకు వెళ్లింది. సడెన్‌గా లాక్‌డౌన్ ప్రకటించడంతో అక్కడే చిక్కుకుపోయింది. అక్కడే సుమారు నెలరోజులపాటు గడిపిన మహిళ ఎలాగైనా ఇంటికి వెళ్లాలని కాలినడకన జైపూర్ బయల్దేరింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


రహదారి వెంట నడుచుకుంటూ వెళ్తుండగా స్థానిక అధికారులు ఆమెను అడ్డగించి రహదారి పక్కనే ఉన్న గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసి క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. మహిళ ఒంటరిగా కనిపించడంతో కామాంధుల కన్ను ఆమెపై పడింది. మహిళను తీసుకెళ్లి ముగ్గురు యువకులు దారుణంగా రేప్ చేశారు. ఒకరి తర్వాత మరొకరు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు.

Also Read:
సికింద్రాబాద్‌లో యువకుడి ఆత్మహత్య.. ప్రకాశం జిల్లాలో విషాదం

బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగుచూసింది. కాలినడకన ఊరికి బయల్దేరిని మహిళపై అమానుషంగా అత్యాచారానికి పాల్పడిన నిందితులను రిషికేష్ మీనా, లఖాన్ రేగర్, కమల్ ఖర్వాల్‌గా గుర్తించారు. ముగ్గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.

Read Also: లాక్‌డౌన్ తట్టుకోలేకపోయిన లేడీ టీచర్.. బిల్డింగ్‌ పైనుంచి దూకి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.