యాప్నగరం

చిత్తూరులో మహిళా వాలంటీర్ అదృశ్యం.. వైసీపీ నేతపై కిడ్నాప్ కేసు

విధులకు హాజరైన మహిళా వాలంటీర్ తిరిగి ఇంటికి వెళ్లలేదు. వైసీపీ నేత ఫోన్ పనిచేయడం లేదు. గతంలో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో సదరు నేత బెయిల్‌పై బయటికొచ్చాడు.

Samayam Telugu 25 Oct 2020, 12:29 pm
మహిళా వాలంటీర్ అదృశ్యం ఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపుతోంది. ఆమె తల్లిదండ్రులు స్థానిక వైసీపీ నేతపై ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. వీరపల్లె పంచాయతీ తొమ్మిదో క్లస్టర్ వాలంటీర్గా పనిచేస్తున్న యువతి గురువారం విధులకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. కంగారపడిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. గతంతో తమ కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించిన వైసీపీ ఎస్పీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులుపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
kidnap


వైసీపీ నేత సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ రావడం.. యువతి ఫోన్ కూడా పని చేయకపోవడంతో అనునాలు బలపడుతున్నాయి. శ్రీనివాసులు, అతని అనుచరులే తమ కుమార్తెను ఎత్తుకెళ్లారని బాధితురాలి తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు పెద్ద పంజాణి పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ నేత శ్రీనివాసులు, అతని భార్య శ్రీదేవి, అనుచరులతో కలిపి ఎనిమిది మందిపై కిడ్నాప్ కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. గతంలో ఇదే వాలంటీర్తో అసభ్యకరంగా ప్రవర్తించి వేధించిన కేసులో శ్రీనివాసులు అరెస్టయి ఇటీవల బెయిల్ పై వచ్చాడు.

Also Read: మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. వీడియోలు తీసి.. జగిత్యాలలో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.