యాప్నగరం

తల్లీకూతుళ్ల రహస్య శృంగారం.. ఒకే ప్రియుడితో.. చివరికి..

తల్లితో రాసలీలలు సాగిస్తున్న యువకుడు కూతురితో ప్రేమాయణం నడిపాడు. తల్లీకూతుళ్లతో రహస్యంగా శృంగార లీలలు సాగించాడు. తీరా తల్లికి తెలిసిపోవడంతో పడక సుఖం కోసం కన్నకూతురిపైనే..

Samayam Telugu 23 Aug 2020, 3:01 pm
తల్లితో రాసలీలలు సాగిస్తున్న యువకుడు.. ప్రేమ పేరుతో ఆమె కూతురిని లొంగదీసుకున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరితో శృంగార లీలలు సాగించాడు. ప్రియుడిపై ఆశలు పెంచుకున్న కూతురు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడం ప్రారంభించడంతో తల్లికి కోపమొచ్చింది. తన రాసలీలలకు అడ్డు వస్తోందన్న కోపంతో ప్రియుడితో కలసి ఘాతుకానికి తెగబడింది. గొంతునులిమి చంపేసి హైడ్రామాకు తెరతీసింది. యూపీలో చోటుచేసుకున్న ఈ డ్రామాకు పోలీసులు కేవలం మూడు గంటల్లోనే ముగింపు చెప్పారిలా..
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
illegal affairs


బరేలీ జిల్లా సుభాష్ నగర్ పోలీస్ స్టేషన్ ఏరియా బస్తీకి చెందిన టీనేజ్ యువతి ఉస్మా కుటుంబంతో కలసి నివసిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన యువకుడు కౌషర్‌ని ప్రేమించింది. ఇద్దరూ హద్దులు దాటి పెళ్లికి ముందే ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. అతనికి అంతకు ముందే ఆమె తల్లి ముకీషాతో వివాహేతర సంబంధం ఉంది. ఆ విషయం కూతురికి తెలియకుండా ఇద్దరితో రహస్యంగా రాసలీలలు సాగించాడు.

కొద్దికాలం తర్వాత ఉస్మా తనను పెళ్లి చేసుకోవాలంటూ కౌషర్‌పై ఒత్తిడి చేయడంతో విషయం ఆమె తల్లి ముకీషాకి తెలిసిపోయింది. తన రాసలీలలకు అడ్డొస్తోందని కన్నకూతురిపైనే కోపం పెంచుకుంది. ప్రియుడితో కలసి కూతురిని అంతమొందించేందుకు పక్కాగా ప్లాన్ రచించింది. ఉదయాన్నే ప్రియుడిని ఇంటికి రప్పించి కూతురిని ప్లాన్ ప్రకారం హత్య చేసింది. అనంతరం తనకేమీ తెలియనట్టు కేకలు వేసి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఆమెను చంపేసి.. తనపై కత్తితో దాడి చేశారంటూ హైడ్రామాకు తెరతీసింది.

Read Also: సంపాదన సరిపోని టైలర్.. చీర, జాకెట్ కట్టుకుని జంక్షన్‌లో.. చివరికి..

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీయడంతో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. మృతురాలి ప్రియుడికి ఆమె తల్లితో కూడా వివాహేతర సంబంధం ఉందని తెలియడంతో ఆ దిశగా విచారణ చేపట్టారు. మృతురాలి తల్లిని, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకుని తమ స్టైల్లో విచారించడంతో అసలు నిజాలు కక్కేశారు. కుటుంబ సభ్యులు నిద్రపోతున్న సమయంలో కూతురు ఉస్మాని వేరే గదిలోకి తీసుకెళ్లి ఇద్దరూ గొంతునులిమి చంపేశారు. అనంతరం కుటుంబ సభ్యులకు అనుమానం రాకుండా ఉండేందుకు కసాయి తల్లి.. ప్రియుడిని అడిగి మరీ ఒంటిపై కత్తితో గాయాలు చేయించుకోవడం గమనార్హం.

Also Read: టెన్త్ విద్యార్థినిపై హెడ్మాస్టర్ కామం.. స్కూల్ లేదని నేరుగా ఇంటికెళ్లి.. చిత్తూరులో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.