యాప్నగరం

భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. జీడిమెట్లలో దారుణం

భార్య జయలక్ష్మిపై అనుమానం పెంచుకున్నాడు సతీష్. మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో దారుణంగా హత్య చేశాడు.

Samayam Telugu 26 May 2020, 8:52 pm
భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భర్త ఘాతుకానికి పాల్పడ్డాడు. భార్యను బండరాయితో మోది కిరాతకంగా హత్య చేశాడు. మద్యం మత్తులో భార్యను దారుణంగా చంపేశాడు. ఈ అమానుష ఘటన హైదరాబాద్‌లో జరిగింది. ఏపీకి చెందిన భార్యాభర్తలు సతీష్, జయలక్ష్మికి 16 ఏళ్ల కిందట వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు సంతానం.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


బతుకుదెరువు కోసం పదేళ్ల కిందట నగరానికి వలస వచ్చి జీడిమెట్ల పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్‌లో నివాసముంటున్నారు. భర్త సతీష్ గోల్డ్ స్మిత్ పనిచేస్తుండగా.. భార్య నిజాంపేట్, హిల్ కౌంటీ కాలనీలో హౌస్ కీపింగ్ సూపర్ వైజర్‌‌గా పనిచేస్తోంది. కొద్దికాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న సతీష్ నిత్యం వేధింపులకు గురిచేసేవాడు.

Also Read: ప్రాణాలు తీసిన వాట్సాప్ స్టేటస్.. యువకుడిని దారుణంగా నరికి..

మద్యం తాగొచ్చి వేధిస్తుండడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త రాత్రి మద్యం మత్తులో దారుణానికి పాల్పడ్డాడు. బంధువుల ఇంట్లో నిద్రిస్తున్న జయలక్ష్మి తలపై బండరాయితో బలంగా మోదాడు. తీవ్రగాయాలపాలైన భార్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also:
చెల్లెలిపై కన్నేసిన కీచక అన్న.. అడవిలోకి తీసుకెళ్లి ఫ్రెండ్స్‌తో కలసి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.