యాప్నగరం

చావుబతుకుల్లో భర్త.. ఆస్పత్రికి తీసుకెళ్తూ భార్య మృతి.. విశాఖలో విషాదం

అప్పుల బాధ తాళలేక నానాజీ పురుగుల మందు తాగి నురగలు కక్కుతూ పడిపోయాడు. అది గమనించిన అతని భార్య పార్వతి ఆస్పత్రికి తీసుకెళ్తూ దుర్మరణం పాలైంది.

Samayam Telugu 18 Apr 2020, 3:33 pm
ఆ ఇల్లాలిపై విధి కన్నెర్ర జేసింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న భర్తను కాపాడుకునేందుకు ప్రయత్నించిన భార్యని అకాల మృత్యువు మింగేసింది. రోడ్డు ప్రమాదం రూపంలో ఆమెను బలితీసుకుంది. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యాయత్నం చేసిన భర్తని ఆస్పత్రికి తీసుకెళ్తూ భార్య దుర్మరణం చెందిన అత్యంత విషాద ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది.
Samayam Telugu death1


పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసిన భర్తను ఆస్పత్రికి తీసుకెళ్తూ ఆటో నుంచి జారిపడి భార్య మరణించిన విషాద ఘటన నక్కపల్లిలో జరిగింది. వెంకట్ నగర్ కాలనీకి చెందిన కర్రి నానాజీ(38), గౌరీ పార్వతి భార్యాభర్తలు. వారికి ఇద్దరు సంతానం. నానాజీ టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుటుంబం కోసం చేసిన అప్పులు పెరిగిపోవడం.. అవి తీర్చే దారి కనిపించక పోవడంతో నానాజీ ఆత్మహత్యాయత్నం చేశాడు.

Also Read: భార్యని చంపి చెరువులో పడేసి.. 3 రోజుల తర్వాత బయటికి తీసి.. చిత్తూరులో షాకింగ్..

ఇంట్లో పురుగుల మందు తాగి పడిపోయాడు. నోటి వెంట నురగలు వస్తూ పడిపోయిన భర్తని చూసి భార్య పార్వతి షాక్‌కి గురైంది. ఎలాగైనా భర్తని బతికించుకోవాలని ఆటో పిలిపించి భర్తని తీసుకుని ఆస్పత్రికి బయల్దేరింది. ఆస్పత్రి జంక్షన్ వద్ద పార్వతి ఆటో నుంచి ప్రమాదవశాత్తూ జారి కిందపడిపోయింది. తల రోడ్డుకి తగలడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మరణించింది. భర్తని బతికించుకునే ఆరాటంలో తన ప్రాణాలు పోగొట్టుకుంది.

భర్తను కాపాడుకోబోయి భార్య ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికులను కలచివేసింది. భర్త నానాజీని పరీక్షించిన వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం అనకాపల్లి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: సెక్స్ సైకోలుగా మారిన జంట.. అసహజ శృంగారం కోసం హింసించి.. చివరికి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.