యాప్నగరం

చికెన్ షాపు యజమానితో మహిళ అఫైర్.. నిద్రిస్తున్న భర్తను తలపై కొట్టి

మూడేళ్ల నుంచి భర్తకు దూరంగా ఉంటున్న మహిళ మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తన సుఖానికి భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడు, తండ్రితో కలిసి హత్య చేసింది.

Samayam Telugu 30 Jan 2020, 4:00 pm
పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ అతడితో కలిసి కట్టుకున్న భర్తనే కిరాతకంగా హత్య చేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లా తుని మండలం డి.పోలవరంలో జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా కల్వచర్ల గ్రామానికి చెందిన చిల్లపల్లి అప్పారావు(33) ఈనెల 18వ తేదీన డి.పోలవరంలో హత్యకు గురయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్య, ఆమె ప్రియుడు, తండ్రితో పాటు మరొక వ్యక్తిని అరెస్ట్ చేశారు.
Samayam Telugu illegal-affair_1200x900xt


Also Read: ప్రియురాలిని అడవిలోకి తీసుకెళ్లి ఫ్రెండ్స్‌తో కలిసి...

అప్పారావుకు వేణు అనే మహిళతో కొన్నాళ్ల క్రితం వివాహమైంది. ఓ హత్యాచారం, దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్న అతడితో కాపురం చేయడం ఇష్టం లేక భార్య మూడేళ్ల క్రితం డి.పోలవరంలోని పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే గ్రామంలో చికెన్ దుకాణం నడిపే వాసంశెట్టి ముసలయ్య(మురళి)తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న అప్పారావు తరుచూ గ్రామానికి వచ్చిన భార్యతో గొడవ పడేవాడు.

Also Read: యువకుడిపై కన్నేసిన వివాహిత... కోరిక తీర్చలేదని అత్యాచారం

దీంతో భర్త తన సుఖానికి అడ్డొస్తున్నాడని వేణు కక్ష పెంచుకుంది. అతడిని చంపి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ప్రియుడు మురళి, తన తండ్రి వంకల చినగవరయ్య(గున్నయ్య), స్థానికుడు లావేటి భానుతో కలిసి అప్పారావును హత్యచేసేందుకు కుట్రపన్నింది. ఈ నెల 18వ తేదీన డి.పోలవరం వచ్చిన అప్పారావు గ్రామంలోని బస్టాండులో నిద్రపోతుండగా తలపై ఇనుపరాడ్డుతో కొట్టి చంపేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్యపై నిఘా పెట్టగా ఆమె అక్రమ సంబంధం వెలుగుచూసింది. దీంతో వేణును అరెస్ట్ చేసి విచారించగా నేరం అంగీకరించింది. దీంతో పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read: ఆంటీలను సుఖపెడుతూ రూ.లక్ష సంపాదన.. హైదరాబాద్‌లో మగ వ్యభిచారుల ఉద్యోగమంటూ టోకరా

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.