యాప్నగరం

వ్యాపారంలో నష్టం.. ఆర్థిక సమస్యలతో మహిళా ఎంపీటీసీ ఆత్మహత్య

వ్యాపారం నష్టం రావడంతో మనస్తాపానికి గురైన ములుగు మండలం జంగాలపల్లికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు ముడతనపెల్లి స్వరాజ్యం ఈ నెల 21 పురుగుల మందు తాగేసింది. చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో చనిపోయింది.

Samayam Telugu 24 Apr 2020, 1:49 pm
తెలంగాణలో ఓ మహిళా ఎంపీటీసీ సభ్యురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ములుగు జిల్లాలోని ములుగు మండలం జంగాలపల్లికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు ముడతనపెల్లి స్వరాజ్యం ఈ నెల 21న ఇంట్లోనే పురుగుల మందు తాగింది. ఆమెను వెంటనే ములుగు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు.
Samayam Telugu suicide


Also Read: ఆరేళ్ల చిన్నారిపై రేప్.. బ్రతికుండగానే కళ్లు పీకేసి పాశవికంగా

హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె గురువారం ప్రాణాలు కోల్పోయింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ములుగు పోలీసులు వివరించారు. స్వరాజ్యం కొన్నాళ్లుగా వ్యాపారం చేస్తోందని, అందులో నష్టం రావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు. ఎంపీటీసీ ఆత్మహత్యకు పాల్పడటంపై స్థానిక ప్రజాప్రతినిధుతు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ములుగు జడ్పీ ఛైర్మన్‌ జగదీశ్వర్‌, ఎమ్మెల్యే సీతక్క తదితరులు ఆమె కుటుంబసభ్యులను పరామర్శించారు.

Also Read: హైదరాబాద్‌లో గ్యాంగ్ రేప్.. మైనర్ బాలికపై నలుగురు కామాంధులు పశువుల్లా

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.