యాప్నగరం

ఫేస్‌బుక్ పరిచయంతో యువతిపై లైంగిక దాడి

కడప జిల్లాలో ఫేస్‌బుక్ మోసగాడిని అరెస్ట్ చేశారు పోలీసులు. పెళ్లయిన విషయం దాచి ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన యువతిని లైంగికంగా దోచుకున్న రూపసాగర్. విషయం తెలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బాధితురాలు

Samayam Telugu 20 Jul 2019, 12:04 pm

ప్రధానాంశాలు:

  • ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతితో ప్రేమాయణం
  • పెళ్లయిన విషయం దాచిపెట్టి ఆమెతో లైంగింక సంబంధం
  • పెళ్లి చేసుకోవాలని కోరిన బాధితురాలికి షాక్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu pjimage (2)
ఫేస్‌బుక్ యువతిని పరిచయం చేసుకుని లైంగికంగా అనుభవించిన తర్వాత పెళ్లికి మొహం చాటేసిన కామాంధుడిని కడప పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. కడపకు చెందిన ఓ యువతికి, పులివెందులకు చెందిన రూప‌సాగర్ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. ఛాటింగ్‌తో మొదలైన వారి పరిచయం డేటింగ్‌ వరకు వెళ్లి హద్దులు దాటే స్థాయికి వెళ్లిపోయింది. యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన రూపసాగర్ ఆమెను అనేక ప్రదేశాలకు తీసుకెళ్లి లైంగికంగా అనుభవించాడు.
ఎప్పుడు పెళ్లి చేసుకోమన్నా ప్రియుడు మాయమాటలు చెప్పి తప్పించుకోవడంతో అనుమానం వచ్చిన యువతి అతడి ఇంటికి వెళ్లి నిలదీసింది. దీంతో రూపసాగర్ ఆమెపై దాడిచేసి దుర్భాషలాడాడు. తనకు ఇంతకుముందే పెళ్లి అయిపోయందని, ఏం చేసుకుంటావో చేసుకోమని తేల్చి చెప్పేశాడు. దీంతో మనస్తాపం చెందిన బాధితురాలు మణికట్టు వద్ద బ్లేడుతో కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది.

యువతి ఆత్మహత్యాయత్నం గురించి తెలుసుకున్న పులివెందుల పోలీసులు ఆస్పత్రికి వెళ్లి ఆరా తీయగా బాధితురాలు తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పింది. జిల్లా ఎస్పీ అభిషేక్‌ మహంతి ఆదేశాలతో ఎస్సీ,ఎస్టీ సెల్‌ డీఎస్పీ ఎన్‌. సుధాకర్‌ కేసును దర్యాప్తు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి శుక్రవారం కోర్టులో హాజరుపరచగా జడ్జి ఆగస్టు 2వ వరకు రిమాండ్ విధించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.