యాప్నగరం

హైదరాబాద్ మహిళా టెక్కీ.. విశాఖలో ఆత్మహత్య, షాకిచ్చే కారణం

ఈ నెల 26వ తేదీ ఉదయం ఎంతసేపటికీ ఆమె తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన వాచ్‌మెన్ అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది.

Samayam Telugu 27 Dec 2019, 3:13 pm
పెద్దలు కుదిర్చిన పెళ్లి సంబంధం నచ్చకపోవడంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విశాఖపట్నంలో జరిగింది. హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి (23) కొంతకాలంగా రుషికొండలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌‌గా పనిచేస్తోంది. ఫ్రెండ్స్‌తో కలిసి ఎంవీపీ కాలనీలో డబుల్‌ రోడ్డులోని లేడీస్‌ హాస్టల్లో ఉంటోంది. రూమ్‌మేట్స్ అందరూ క్రిస్‌మస్ సెలవులకు ఇళ్లకు వెళ్లిపోవడంతో ఒంటరిగా ఉంది.
Samayam Telugu suicie


Also Read: గ్రహణ సమయంలో కన్యను బలిస్తే మంచిదని.. నేపాల్ నుంచి యువతిని తీసుకొచ్చి

ఈ నెల 25వ తేదీన హైదరాబాద్‌లో తల్లిదండ్రులకు ఫోన్ చేసి పీడకలలు వస్తున్నాయని చెప్పింది. తర్వాతి రోజు ఉదయం ఎంతసేపటికీ ఆమె తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన వాచ్‌మెన్ అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో అతడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సీఐ షణ్ముఖరావు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.

Also Read: యువకుడితో లాడ్జిలో రొమాన్స్ చేసి.. రూ.4.49లక్షలు దోచుకున్న కిలేడీ

దీనిపై కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. ఇటీవల ఆమెకు పెద్దలు పెళ్లి నిశ్చయం చేశారని, ఆ సంబంధం ఇష్టం లేకనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఆత్మహత్య సమాచారం తల్లిదండ్రులకు చేరవేసినట్లు వెల్లడించారు.

Also Read: లాడ్జిలో వ్యభిచారం.. నకిలీ విటుడిని పంపించి గుట్టురట్టు చేసిన పోలీసులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.