యాప్నగరం

వివాహితతో అక్రమ సంబంధం.. కర్నూలులో యువకుడి దారుణహత్య

ఓ వివాహితతో అక్రమ సంబంధమే యువకుడి హత్యకు కారణంగా తెలుస్తోంది. అతడిని గోనెగండ్ల మండలం గంజిహళ్లి గ్రామానికి చెందిన వాడుగా గుర్తించారు.

Samayam Telugu 7 May 2020, 8:27 am
అక్రమ సంబంధం ఓ యువకుడి ప్రాణాన్ని బలిగొంది. కర్నూలు జిల్లాలోని దేవనకొండ మండలం కుంకనూరు గ్రామంలో ఓ యువకుడిని దుండగులు అతి కిరాతకంగా చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Samayam Telugu Image


Also Read: పక్కింటి యువకుడితో ఆంటీ అఫైర్.. గుట్టురట్టు చేసిన కరోనా

మృతుడిని గోనెగండ్ల మండలం గంజిహళ్లి గ్రామానికి చెందిన యువకుడిగా పోలీసులు గుర్తించారు. ఓ వివాహితతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న క్రమంలోనే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ హత్యకు పాల్పడింది మహిళ బంధువులా? లేక ఇతరులా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. యువకుడిని ఇక్కడే హత్య చేశారా? లేవ వేరే ప్రాంతంలో చంపి ఇక్కడ పడేశారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: లాక్‌డౌన్‌లో రసిక ప్రియుల కష్టాలు.. కోరికలు తీర్చాలంటూ సెక్స్‌వర్కర్లపై ఒత్తిడి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.