యాప్నగరం

చెల్లెలికి ఆ వేధింపులు.. అడిగినందుకు అన్న దారుణ హత్య

చెల్లెలి కోసం వెళ్లి అన్న ప్రాణాలు కోల్పోయాడు. తన సోదరిని వేధిస్తూ చూస్తూ ఊరుకోనని హెచ్చరించడంతో ఆగ్రహం చెందిన పోకిరీ దారుణంగా చంపేసి పరారైన దారుణ ఘటన చోటుచేసుకుంది.

Samayam Telugu 1 Apr 2020, 7:17 pm
చెల్లెలిని వేధిస్తున్న పోకిరీ వెధవకి బుద్ది చెప్పేందుకు వెళ్లి ఓ అన్న ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన వెలుగుచూసింది. తన సోదరి వెంట పడొద్దని.. పద్ధతి మార్చుకోమని హెచ్చరించినందుకు దారుణ హత్యకు గురయ్యాడు. విచక్షణా రహితంగా దాడి చేయడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో హసన్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Samayam Telugu death4


దలిగంజ్ ప్రాంతానికి చెందిన ఓ యువతిని అదే ప్రాంతానికి చెందిన ఫజల్ అనే యువకుడు తరచూ వేధింపులకు గురిచేస్తున్నాడు. కొద్దికాలం మౌనంగా భరించిన యువతి.. వేధింపులు ఎక్కువవడంతో భరించలేక ఆమె అన్న కీర్తన్ రావత్‌(22)కి చెప్పుకుని భోరుమంది. చెల్లెలిని వేధింపులకు గురిచేస్తున్న విషయం తెలుసుకున్న రావత్.. తన సోదరుడు రోహిత్‌తో కలసి వార్నింగ్ ఇచ్చేందుకు ఫజల్‌ని వెతుక్కుంటూ వెళ్లాడు.

Also Read: భర్త ఉద్యోగం ఊడగొట్టించి.. విడాకులడిగిన భార్య.. చివరికి..

తన చెల్లెలిని ఏడిపించొద్దని.. పద్ధతిగా ఉండాలని కీర్తన్ హితవు పలికాడు. మరోసారి ఇలా జరిగితే బాగోదని తీవ్రంగా హెచ్చరించాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగడంతో ఆగ్రహానికి గురైన ఫయాజ్ కర్రతో కీర్తన్‌పై దాడి చేశాడు. తలపై గట్టిగా కొట్టడంతో తీవ్ర గాయాలపాలైన కీర్తన్ అక్కడే కుప్పకూలాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఫయాజ్ పరారీలో ఉన్నాడు.

Read Also: అంబులెన్స్ ప్రాణాలు తీసింది.. కోలార్‌లో చిత్తూరు వాసి మృతి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.