యాప్నగరం

భార్యపై అనుమానం.. యువకుడు మంచంపై నిద్రిస్తూ కనిపించడంతో..

తన భార్య మరొకరితో శారీరక సంబంధం పెట్టుకుందని పట్టం వెంకన్న అనుమానించేవాడు. నిత్యం అదే విషయమై భార్యతో గొడవపడేవాడు. చివరికి యువకుడి ప్రాణాన్ని బలి తీసుకున్నాడు.

Samayam Telugu 29 May 2020, 1:47 pm
భార్యపై అనుమానంతో ఘాతుకానికి పాల్పడ్డాడో కసాయి భర్త. ఆమె మరొకరితో వివాహేతర సంబంధం నెరుపుతోందన్న అనుమానంతో తరచూ గొడవపడేవాడు. ఇంటికి సమీపంలో ఉండే యువకుడిపై కక్ష గట్టాడు. అర్ధరాత్రి వేళ మంచంపై పడుకుని కనిపంచడంతో అతి కిరాతకంగా నరికి చంపేశాడు. ఈ దారుణ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో వెలుగుచూసింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


జిల్లాలోని శంఖవరం మండలం సిద్ధివారిపాలేనికి చెందిన పట్టం వెంకన్న భార్యపై అనుమానం పెంచుకున్నాడు. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం నెరుపుతోందని అనుమానిస్తూ తరచూ గొడవపడేవాడు. అదే విషయమై నిత్యం ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. తన భార్యతో ఆ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో గ్రామానికి చెందిన తలుపులయ్య(25) అనే యువకుడిపై కక్ష పెంచుకున్నాడు.

Also Read: కొత్త కోడలిపై కన్నేసిన మామ.. ఒంటరిగా ఉన్న సమయం చూసి..

ఎలాగైనా తలుపులయ్యను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో తలుపులయ్య తన ఇంట్లో మంచంపై ఒంటరిగా నిద్రిస్తుండడంతో ఒక్కసారిగా మారణాయుధంతో దాడి చేశాడు. విచక్షణా రహితంగా కత్తితో నరికి కిరాతకంగా చంపేశాడు. తీవ్రరక్తస్రావంతో తలుపులయ్య మంచంపైనే ప్రాణాలు కోల్పోయాడు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని హత్యపై ఆరా తీశారు. మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం కోసం ప్రత్తిపాడు ప్రభుత్వాస్పత్రికి పంపారు. వివాహేతర సంబంధం అనుమానంతో యువకుడిని హత్య చేయడంతో గ్రామంలో కలకలం రేగింది. గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు.

Read Also: మృగాడి కామకోరికలకు మహిళ బలి.. భర్త లేడని.. గుంటూరులో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.