యాప్నగరం

పరిగిలో పదేళ్ల బాలికపై అత్యాచారం.. కామాంధుడిని చితక్కొట్టిన స్థానికులు

బాలికను మాయమాటలతో తీసుకెల్లిన సాయి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కాసేపటికి ఇంటికి వచ్చిన బాలిక తీవ్ర రక్తస్రావంతో బాధపడటంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు.

Samayam Telugu 19 Jan 2020, 11:48 am
వికారాబాద్ జిల్లా పరిగిలో దారుణం జరిగింది. బీసీ కాలనీకి చెందిన పదేళ్ల బాలికపై సాయి(24) అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను మాయమాటలు చెప్పి ఊరి చివరకు తీసుకెళ్లి కామాంధుడు దారుణానికి ఒడిగట్టాడు. స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న బాలికకు తల్లిదండ్రులు లేదు. దీంతో మేనమామ ఇంట్లో ఉంటోంది. శనివారం సాయంత్రం ఆడుకునేందుకు బయటకు వెళ్లిన బాలిక రాత్రి 9 గంటలైనా తిరిగిరాలేదు. దీంతో కంగారుపడిన కుటుంబసభ్యులు ఆమె కోసం వెతకసాగారు.
Samayam Telugu pjimage (9)


Also Read: మసాజ్ సెంటర్‌ ముసుగులో వ్యభిచారం.. విదేశీ యువతులను తీసుకొచ్చి

కాసేపటి తర్వాత ఇంటికి చేరుకున్న బాలిక అస్వస్థతకు గురైనట్లు కనిపించడంతో ఏం జరిగిందని మేనమామ ప్రశ్నించాడు. దీంతో తనపై జరిగిన దారుణాన్ని వివరించింది. జననాంగాల నుంచి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆందోళన పడిన వారు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలికను పరీక్షించిన డాక్టర్లు అత్యాచారం జరిగినట్లు చెప్పడంతో నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

Also Read: హాస్టల్లోనే బిడ్డను ప్రసవించిన విద్యార్థిని.. వార్డెన్‌పై వేటు

ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బాలికకు వైద్య పరీక్షలు చేయిస్తున్నారు.

Also Read: తెలంగాణలో మిస్టరీగా మారిన మెడికో మృతి.. హత్యా? ఆత్మహత్యా?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.