యాప్నగరం

ఫ్రెండ్ భార్యని ప్రేమించిన యువకుడు.. ఆమె రిజెక్ట్ చేయడంతో..

పెళ్లైన మహిళను ప్రేమించాడు విక్కీ. కరోనా కారణంగా బయట తిరగనివ్వకపోవడంతో ఆమెను కలవలేక తీవ్ర నిరాశనిస్పృహ‌కు లోనయ్యాడు. ఎట్టకేలకు ఆమెను కలిసినా మరుక్షణమే ఊహించని ఉపద్రవం ముంచుకొచ్చింది.

Samayam Telugu 15 May 2020, 6:59 pm
ఫ్రెండ్ భార్యని ప్రేమించాడో యువకుడు. ఆమె భర్త జైలుకెళ్లడంతో ఇద్దరికీ సాన్నిహిత్యం ఏర్పడింది. సడెన్‌గా లాక్‌డౌన్ విధించడంతో విరహ వేదనకు గురయ్యాడు. ఎలాగైనా ఆమెకు తన ప్రేమ విషయం చెప్పాలని తహతహలాడాడు. చివరికి ధైర్యం చేసి లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఆమె ఇంటికి వెళ్లాడు. ఆమెను కలిసి ఇంటి నుంచి బయటికి వచ్చిన యువకుడు.. ఆమె ఇంటి ముందే తుపాకీతో కాల్చుకున్నాడు. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలో వెలుగుచూసింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


దేశ రాజధాని ఢిల్లీలోని సమీపంలోని కోట్ల ముబారక్‌పూర్‌కి చెందిన విక్కీ నార్త్ ఢిల్లీలోని నరేలా ప్రాంతానికి చెందిన వివాహితను ప్రేమించాడు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం కుదిరిన సమయంలో సడెన్‌గా లాక్‌డౌన్ ప్రకటన వెలువడింది. ఆమెను కలవకుండా ఉండలేకపోయిన విక్కీ నేరుగా స్వర్ణజయంతి నగర్‌లోని ఆమె ఇంటికి వచ్చాడు. అతనితో బయటకు రావాలని ఆమెను కోరాడు.

Also Read: ప్రాణాలు తీసిన AC.. నిద్రలోనే దంపతుల దుర్మరణం

లాక్‌డౌన్ నిబంధనల నేపథ్యంలో ఆమె అందుకు అంగీకరించలేదు. దీంతో ఆమె ఇంట్లోకి వెళ్లి తనతో మాట్లాడి ఇంటి బయటకు వచ్చిన విక్కీ నాటుతుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఎడమ భుజం కింద కాల్చుకుని కుప్పకూలిపోయాడు. విక్కీ ప్రేమను ఆమె తిరస్కరించడంతోనే అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. విక్కీ ఆమె భర్త స్నేహితుడని.. అప్పుడప్పుడూ వాళ్లింటికి వచ్చి వెళ్లేవాడని స్థానికులు చెబుతున్నారు. మద్యం మత్తులో ఉన్న విక్కీ ప్రియురాలి ఇంటి నుంచి బయటికొచ్చి తుపాకీతో కాల్చుకున్నాడని చెప్పారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Read Also: ఇంట్లో చోరీకి వెళ్లిన దొంగ.. మహిళ నిద్రిస్తూ కనిపించడంతో..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.