యాప్నగరం

Social Media Addiction: ఫోటోకి లైకులు రాలేదని యువతి ఆత్మహత్య

ఫేస్‌బుక్‌కు బానిసైన క్లోయె తన ఫోటోలకు లైకులు రావడం లేదని డిప్రెషన్‌కు గురయ్యేది. మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Samayam Telugu 23 Aug 2020, 9:35 am
ఇటీవల కాలంలో యువత సోషల్‌మీడియాకు బాగా అలవాటు పడిపోతోంది. బాహ్య ప్రపంచాన్ని పట్టించుకోకుండా ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి యాప్‌లతో కాలం గడిపేస్తున్నారు. అతిగా సోషల్‌మీడియా వినియోగిస్తే మానసికంగా అనేక సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇలాగే ఫేస్‌బుక్‌ వాడకాన్ని వ్యసనంగా మార్చుకున్న 19ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇంగ్లండ్‌లోని లాంచెస్టర్‌లో జరిగింది.
Samayam Telugu facebook


Also Read: రిసార్ట్‌లో ఘోరం.. మైనర్ బాలికపై 30 మంది సామూహిక అత్యాచారం

నగరానికి చెందిన క్లోయె డేవిసన్(19) అనే యువతి కొద్ది నెలల క్రితం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించకపోవడంతో ఆమె ఆత్మహత్యకు ఎలాంటి కారణం వెలుగులోకి రాలేదు. అయితే కొద్దిరోజుల క్రితం ఆమె స్నేహితురాలు అసలు నిజాన్ని బయటపెట్టడంతో అందరూ షాకయ్యారు.

Also Read: ఇద్దరు హిజ్రాలు సహా ముగ్గురి హత్య... బావిలో తేలిన శవాలు

క్లోయె అందంగా ఉండేది. చదువుకుంటూనే ఓ హోటల్‌లో పనిచేసేది. తరుచూ ఫోటోలు తీసుకుని వాటిని ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసేది. వాటికి పెద్దగా లైకులు రాకపోవడంతో తనను ఎవరూ ఇష్ట పడటం లేదని స్నేహితుల వద్ద ఆవేదన చెందేది. ఓ రోజు అందంగా రెడీ అయి సెల్ఫీ తీసుకుని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. దానికి ఎవరూ లైకులు కొట్టకపోవడంతో డిప్రెషన్‌కు గురై ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న క్లోయె తల్లి తీవ్ర ఆవేదన చెందుతోంది. తన కూతురిలా సోషల్‌మీడియాకు బానిసై ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దని, తల్లిదండ్రులు పిల్లలను కనిపెట్టుకుని ఉండాలని పిలుపునిస్తోంది.

Also Read: హైదరాబాద్‌: బంగ్లా అమ్మాయిలతో వ్యభిచారం.. ఎన్ఐఏ ఛార్జిషీట్ దాఖలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.