యాప్నగరం

రెండు వారాలకే కొత్త కోడలికి వేధింపులు... పుట్టింట్లో ఉరేసుకున్న యువతి

మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లో పరిచయమైన హైదరాబాద్‌కు చెందిన నరేష్‌కుమార్‌ను చెన్నైకి చెందిన యువతి వివాహం చేసుకుంది. రెండు వారాలకే వారు అదనపు కట్నం గురించి వేధించసాగారు.

Samayam Telugu 31 Jul 2020, 8:05 am
వరకట్న వేధింపులు ఓ యువతి ప్రాణాలను బలిగొన్నాయి. పెళ్లయిన రెండు వారాల నుంచే అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధిస్తుండటంతో ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తమిళనాడు రాజధాని చెన్నైలోని చింతాద్రిపేట స్కూల్‌రోడ్డుకు చెందిన ఓ యువతికి హైదరాబాద్‌కు చెందిన నరేష్‌కుమార్‌(24) మ్యాట్రిమోని వెబ్‌సైట్ ద్వారా పరిచయమయ్యాడు. రెండు కుటుంబాల అంగీకారంతో గతేడాది వీరి వివాహం ఘనంగా జరిగింది. పెళ్లయిన రెండు వారాలకే అత్తింటి వారు వరకట్నం కోసం వేధించసాగారు.
Samayam Telugu Image


Also Read: యాదాద్రి: కరోనా జాగ్రత్తలు చెప్పిన అత్తను కర్రతో చితకబాదిన కోడలు

దీంతో ఆమె చెన్నైలోని పుట్టింటికి వచ్చేసింది. కొద్ది నెలల క్రితం చెన్నైకి వెళ్లిన నరేష్‌కుమార్ లాక్‌డౌన్ కారణంగా చింతాద్రిపేటలోని అత్తగారింట్లో చిక్కుకుపోయాడు. ఈ క్రమంలోనే తన కూతురిని కాపురానికి తీసుకెళ్లి మంచిగా చూసుకోవాలని యువతి తండ్రి అల్లుడిని కోరాడు. అయితే కట్నంగా 120 సవర్ల బంగారం అడిగితే 40 సవర్లు మాత్రమే ఇచ్చారని, మిగిలిన బంగారం కూడా ఇస్తేనే మీ కూతురిని కాపురానికి తీసుకెళ్తానని నరేష్‌కుమార్‌ చెప్పాడు. దీంతో మనస్తాపానికి గురైన యువతి బుధవారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: అగ్నిసాక్షిగా కట్టిన తాళితోనే భార్య గొంతు నులిమి చంపేసిన భర్త

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.