యాప్నగరం

Hyderabad: ప్రియురాలు మాట్లాడటం లేదని డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య

చిన్ని వివాదం కారణంగా ప్రియురాలు తనకు దూరమైందన్న మనస్తాపంతో డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగేళ్లుగా ప్రేమించిన యువతి రెండు నెలల నుంచి మాట్లాడకపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన ఉరేసుకున్నాడు.

Samayam Telugu 13 Oct 2019, 10:28 am
Samayam Telugu suicide

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి యువతి తనను దూరం పెట్టిందన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఫిలింనగర్ ఎంఆర్‌సీ కాలనీలో నివసించే అభిషేక్(20) యూసుఫ్‌గూడలోని సెయింట్ మేరీస్ కాలేజీలో డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. తనకు బంధువైన ఓ యువతి(19)ని నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి కూడా అభిషేక్‌తో చనువుగా ఉండేది. ఇద్దరూ సినిమాలకు, షికార్లకు తిరిగారు. చరవాణుల్లో మాటలు, సందేశాలు, ఫొటోలు పంపించుకున్నారు.

Also Read: శోభనం గదిలో భర్తకు బదులు మరిది... షాకైన నవ వధువు

రెండు నెలల క్రితం ప్రేమికుల మధ్య చిన్న తగాదా రావడంతో వారి మధ్య దూరం పెరిగింది. ఆ యువతి అభిషేక్‌ను పూర్తిగా దూరం పెట్టింది. ప్రియురాలు తనను పట్టించుకోకపోవడంతో అభిషేక్ డిప్రెషన్‌లోని వెళ్లిపోయాడు. ఆమెతో మాట్లాడాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో తనకు చావే శరణ్యమనుకున్నాడు. ప్రియురాలితో చివరిసారిగా మాట్లాడాలని శుక్రవారం మెసేజ్ పెట్టాడు. తాను చనిపోతున్నానని, చివరిసారిగా నీతో మాట్లాడాలని మెసేజ్‌ చేసినా ఆమె పట్టించుకోలేదు. అతడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు.

Also Read: అనుమానపు చిచ్చు.. భార్యను గొడ్డలిలో నరికి చంపిన కానిస్టేబుల్

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అభిషేక్ శనివారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. గమనించి అతడి అన్న, వదిన కిందికి దించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పాడు. దీంతో అతడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. యువతి వేధింపుల వల్లే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని అభిషేక్ తండ్రి శనివారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read: పోర్న్ వెబ్‌సైట్లో భార్య సెక్స్ వీడియా.. స్నేహితుడిపై కేసు పెట్టిన భర్త

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.