యాప్నగరం

Fact Check: జనసేన లాంగ్ మార్చ్ ‘ఏరియల్ వ్యూ’ అదిరిపోయిందా?

విశాఖలో నవంబర్ 3న జనసేన నిర్వహించిన Janasena Long March నిరసనకు సంబంధించిన ఏరియల్ వ్యూ అని ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Samayam Telugu 11 Nov 2019, 5:51 pm
విషయం: ఏపీలో ఇసుక కొరతపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు జనసేన పార్టీ నవంబర్ 3న విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు ఈ లాంగ్ మార్చ్‌కు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో విశాఖ వీధులు జనసంద్రాన్ని తలపించాయి.
Samayam Telugu protest


ఈ క్రమంలో విశాఖలో జనసేన నిర్వహించిన లాంగ్ మార్చ్ నిరసన ఏరియల్ వ్యూ అని ఓ వీడియో పోస్ట్ చేశారు. ఇక అది మొదలుకుని జనసైనికులు వీడియోను షేర్, లైక్స్, కామెంట్స్ చేస్తున్నారు.

నిజం: చిలీలో జరిగిన భారీ నిరసన వీడియోను జనసేన లాంగ్ మార్చ్ ఏరియల్ వ్యూ వీడియో అని ప్రచారం చేస్తున్నారు.
Also Read: తలపాగాతో మోదీ. భక్తులపై సెటైర్లు.. అసలేం జరిగింది?

పరిశీలన: గత అక్టోబర్ నెలలో చిలీ దేశంలో పరిపాలనకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. నియంతపాలన మాకు వద్దంటూ జనాలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. అయితే ఆ నిరసనకు సంబంధించిన వీడియోను జనసేన లాంగ్ మార్చ్ వీడియో ఏరియల్ వ్యూ అని పోస్ట్ చేశారు. Largest Mobilization Since the End of Dictatorship అని సెర్చ్ చేస్తే డెమోక్రసీ నౌ పోస్ట్ చేసిన కథనాలు కనిపిస్తాయి. బీబీసీ మీడియా పోస్ట్ చేసిన చిలీ నిరసన వీడియోను వీక్షించండి.

Chile protest


నిర్ధారణ: నియంత పాలనకు చరమగీతం పాడాలంటూ చిలీ దేశంలో గత నెల (అక్టోబర్)లో జరిగిన భారీ నిరసనకు సంబంధించిన వీడియోను నవంబర్ 3న జరిగిన జనసేన లాంగ్ మార్చ్ ఏరియల్ వ్యూ అని పోస్ట్ చేశారు. స్థానిక మీడియాలో ఈ వీడియో జనసేన లాంగ్ మార్చ్‌కు సంబంధించినదిగా రిపోర్ట్ లేకపోవడం గమనార్హం.
Also Read: ‘భారత్ మాతా కీ జై’ అన్నందుకు చావబాదారా?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.