యాప్నగరం

Fact Check: దీపావళి స్టాల్స్‌లో అగ్నిప్రమాదం.. ఖమ్మంలో జరిగిందా?

దీపావళి క్రాకర్స్ దుకాణాలలో అగ్నిప్రమాదం సంభవించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఖమ్మంలో ఇలా జరిగిందని నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు.

Samayam Telugu 29 Oct 2019, 5:41 pm
విషయం: దీపావళి వచ్చిందంటే చాలు.. ఖచ్చితంగా ఏదో ఓ ప్రాంతంలో పటాసులు విక్రయించే స్టాల్స్‌లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ‘ఈరోజు ఖమ్మం పట్టణం సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం ఎస్.ఆర్.అండ్.బి.జి.ఎన్.ఆర్ కాలేజ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దీపావళి స్టాల్స్ నిప్పురవ్వలు చెలరేగి తగలబడి పోయినవి’ అని ఓ వీడియో ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు.
Samayam Telugu Crackers explode


నిజం: గతంలో మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగిన అగ్ని ప్రమాదం వీడియోను ఖమ్మంలో జరిగిన ఘటన అని ప్రచారం చేస్తున్నారు.

పరిశీలన: ఖమ్మంలో ఏర్పాటు చేసిన దీపావళి స్టాల్స్‌లో అగ్నిప్రమాదం సంభవించినట్లు కొన్ని తెలుగు వెబ్ మీడియాలలో వార్తలొచ్చాయి. మీడియా సంస్థ ఏఎన్ఐ సంస్థ సైతం మొదట ఖమ్మంలోని సర్ధార్ వల్లభబాయ్ పటేల్ స్టేడియంలో అగ్ని ప్రమాదం జరిగిందని ట్వీట్ చేసింది. అనంతరం సవరణ ఇస్తూ క్షమాపణలు చెప్పింది. గతంలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను తాజాగా ఖమ్మంలో జరిగిన ఘటనగా రిపోర్ట్ చేసి తప్పదాన్ని గుర్తించినట్లు ఏఎన్ఐ తమ సవరణ ట్వీట్లో వివరించింది.

ఈ ఘటనకు సంబంధించి ‘Cracker shops explode in Aurangabad’ అనే కీవర్డ్స్‌తో సెర్చ్ చేస్తే ఓ వీడియో కనిపిస్తుంది. ABP న్యూస్, మ్యాంగో న్యూస్ మీడియాలు తమ యూట్యూబ్ ఛానల్‌లో 2016లో పోస్ట్ చేసిన ఔరంగాబాద్ అగ్ని ప్రమాదం వీడియోలను గమనించవచ్చు.

నిర్ధారణ: నెటిజన్లు పోస్ట్ చేసినట్లుగా ఖమ్మంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలో నిర్వహించిన దీపావళి స్టాల్‌కు సంబంధించిన వీడియో కాదని టైమ్స్ (సమయం) ఫ్యాక్ట్ చెక్ టీమ్ గుర్తించింది. ఔరంగాబాద్‌లో 2016లో జరిగిన అగ్నిప్రమాదం ఘటన వీడియోను తాజాగా ఖమ్మంలో జరిగిందని దుష్ప్రచారం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.