యాప్నగరం

వరదల్లో జింక పిల్లను కాపాడిన ఆ శివగాముడు అసోం‌ బాలుడు కాదా.. అసలు నిజం ఇదీ!

అసోంలో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా అక్కడ సంభవించిన వరదల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఓ బాలుడు తన చేత్తో జింక పిల్లను పైకెత్తి కాపాడిన ఫోటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే.

Samayam Telugu 25 Jul 2020, 4:35 pm
బాహుబలి సినిమాలో శివగామిలాగా.. వరదలు పోటెత్తిన నదిలో ఓ బాలుడు తల వరకు మునిగి ఓ జింకపిల్లను ఒంటిచేత్తో పైకెత్తి పట్టి కాపాడిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వరదలతో అతలాకుతలమవుతోన్న అసోంలోనిదే ఈ ఫొటో అంటూ షేర్ చేస్తూ.. ఆ బాలుడిని అసోం బాహుబలి అని ఆకాశానికెత్తేశారు. తొలుత విశాల్ దూబే అనే వ్యక్తి జులై 21న ఈ ఫోటోను తన ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్ట్ చేయగా.. దీనిని పలువురు షేర్ చేశారు.
Samayam Telugu జింకను కాపాడిన బాలుడు
Deer Rescued by Boy


ట్రూత్
అయితే, ఇది అసోం వరదలకు సంబంధించిన ఫోటో కాదు.. 2014 నాటి బంగ్లాదేశ్ వరదల సందర్భంగా ఓ బాలుడు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా జింకను పైకెత్తి కాపాడాడు.

assam floods


వెరిఫికేషన్ అండ్ మెథడాలజీ

ఫోటోలలో ఒకదానిని రివర్స్-ఇమేజ్ సెర్చ్ చేయగా.. మెయిల్ ఆన్‌లైన్ అనే వెబ్‌సైట్ ఫిబ్రవరి 6, 2014న ఈ ఫోటో‌ను ప్రచురించినట్టు గుర్తించారు. ‘బంగ్లాదేశ్ నదిలో వరద దాటికి కొట్టుకుపోతున్న జింకలను కాపాడటానికి ఓ బాలుడు ప్రాణాలను పణంగా పెట్టి పెద్ద సాహసం చేశాడు’ అనే టైటిల్‌‌తో దీనిని ప్రచురించారు. ఇదే ఫోటోను ప్రస్తుతం అసోం వరదలకు సంబంధించినదిగా షేర్ చేశారు.

బెలాల్ అనే బాలుడు నిర్భయంగా తన ప్రాణాలను పణంగా పెట్టి, నిస్సహాయంగా ఉన్న జింక పిల్లలను మునిగిపోకుండా కాపాడటానికి ధైర్యాన్ని ప్రదర్శించాడని ని పేర్కొంది. ఈ సమయంలో బాలుడు మళ్లీ కనిపించబోతున్నాడో లేదో తెలియదు. అతడు జింక పిల్లను నది అవతలి వైపునకు చేర్చినప్పుడు స్థానికులు ఉత్సాహంగా ఉన్నారు. ఈ ఘటన బంగ్లాదేశ్‌లోని నోవఖాలి నదిలో చోటుచేసుకుంది.

తీర్పు

బంగ్లాదేశ్ బాలుడి పాత ఫోటోలను ప్రస్తుతం అసోం వరదల ఫోటోలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు టైమ్స్ ఫ్యాక్ట్ చెక్ టీమ్ పరిశీలనలో గుర్తించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.