యాప్నగరం

Fact Check: జామియా విద్యార్థులపై పోలీసుల దాష్టీకమా.. ఆ ఫొటోలో నిజమెంత!

పౌరసత్వ సవరణ బిల్లు చట్టంగా మారడంతో ఉత్తరాదిన నిరసన కొనసాగుతోంది. ఈ క్రమంలో జామియా విద్యార్థులపై పోలీసుల దుశ్చర్య అంటూ ఓ ఫొటో వైరల్ అవుతోంది.

Samayam Telugu 18 Dec 2019, 7:48 pm
విషయం: పౌరసత్వ సవరణ బిల్లు చట్టంగా మారడంతో ఉత్తరాదిన ఆగ్రహజ్వాలలు చెలరేగాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఆహ్వానించగా, కాంగ్రెస్ సహా కొన్ని పార్టీలు పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో అల్లర్లతో కూడిన నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జామియా విద్యార్థులపై పోలీసుల దుశ్చర్య అంటూ ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫొటో వైరల్ కావడంతో పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Samayam Telugu CAA

Screenshot grabbed from FB

నిజం: జామియా వర్సిటీ విద్యార్థులపై పోలీసులు చర్య అని షేర్ అవుతున్న ఫొటోకు, ఈ విషయానికి సంబంధం లేదు. 2011లో సమాజ్ వాదీ పార్టీకి చెందిన నేతను ఓ పోలీసు బూటుతో తొక్కుతుండగా క్లిక్ మనిపించిన ఫొటో అది. అప్పటినుంచి ఏదో ఓ సందర్భంలో ఈ ఫొటో వైరల్ అవుతోంది.
Also Read: రేషన్ కార్డులపై Jesus image.. వైఎస్ జగన్‌పై విమర్శలు.. నిజమేంటి!

పరిశీలన: వైరల్ అవుతున్న ఫొటోతో గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా దలల్లన్‌టాప్ అనే వెబ్‌సైట్ 2016లో పోస్ట్ చేసిన కథనం దర్శనమిస్తుంది. డీఐజీ కాలిబూట్ల కింద సమాజ్ వాదీ (లోహ్య వాహిని) పార్టీ నేత ఆనంద్ బదౌరియా ముఖం అని అప్పట్లో జరిగిన ఘటనను మీడియా రిపోర్ట్ చేసింది.
Screenshot grabbed from thelallantop.com
జమ్మూకశ్మీర్ ప్రత్యేక హోదాకు స్వస్తి పలికి రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటైన సమయంలోనూ ఈ ఫొటో వైరల్ అయిన విషయం తెలిసిందే. కశ్మీర్3 అని ఓ నెటిజన్ ఈ ఫొటోను పోస్ట్ చేశాడు. టైం ఫిల్టర్ ద్వారా గూగుల్‌లో సెర్చ్ చేయగా.. బడాస్4మీడియా అనే వెబ్ సైట్ 2011 మార్చి 13న ఓ కథనంలో ఈ ఫొటోను పోలిన పేపర్ క్లిప్పింగ్ పోస్ట్ చేసినట్లు గుర్తించవచ్చు.

నిర్ధారణ: జామియా విద్యార్థులపై పోలీసుల దుశ్చర్య అంటూ వైర్ అయిన ఫొటో తాజా ఘటన కాదని టైమ్స్ ఫ్యాక్ట్ చెక్ టీమ్ గుర్తించింది. 2011లో సమాజ్ వాదీ (లోహ్య వాహిని) నేత ఆనంద్ బదౌరియాపై దాష్టీకానికి పాల్పడ్డ ఘటన ఫొటోను జామియా విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యమంటూ కొందరు నెటిజన్లు దుష్ప్రచారం చేస్తున్నారు.
Fact ChecK: అవి Disha నిందితుల మృతదేహాలు కాదు.. నిజమేంటి!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.