యాప్నగరం

నేపాల్ పోలీసుల కాల్పులు.. భారతీయ రైతు మృతి, ఇద్దరికి గాయాలు.. సరిహద్దుల్లో ఉద్రిక్తత!

భారత్, నేపాల్ మధ్య సరిహద్దు వివాదం నడుస్తోన్న వేళ.. నేపాల్ పోలీసులు భారతీయులపైకి తూటా ఎక్కుబెట్టారు. ఎక్కడి నుంచి ఇసు

Samayam Telugu 12 Jun 2020, 3:33 pm
భారత్, నేపాల్ మధ్య సరిహద్దు వివాదం నడుస్తోన్న వేళ.. నేపాల్ పోలీసు కాల్పుల్లో ఓ భారతీయుడు మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఇండో-నేపాల్ సరిహద్దుల్లో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. నేపాల్ పోలీసుల కాల్పుల్లో మరణించిన వ్యక్తిని బిహార్‌‌లోని సీతమర్హి జిల్లాకు చెందిన యువ రైతుగా గుర్తించారు. గాయపడిన ఇద్దర్నీ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారికి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు.
Samayam Telugu కాల్పుల్లో గాయపడిన వ్యక్తి
nepal police fire


రైతులు పొలాల్లో పని చేస్తుండగా.. లాల్‌బండీ - జానకీనగర్ బోర్డర్‌లో నేపాల్ పోలీసులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఒకరు చనిపోవడంతో.. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి. సమాచారం అందుకున్న సీతామర్హి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారని జిల్లా ఎస్పీ అనిల్ కుమార్ తెలిపారు.

మరణించిన వ్యక్తి పేరు వికేశ్ కుమార్ రాయ్ (25) అని స్థానికులు తెలిపారు. ఉమేశ్ రామ్, ఉదయ్ థాకూర్ అనే ఇద్దరికి బుల్లెట్ గాయాలు అయ్యాయని.. లగన్ రాయ్ అనే వ్యక్తిని నేపాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని స్థానికులు తెలిపారు. తమ పొలం నేపాల్‌లోని నారాయణ్‌పూర్‌ పరిధిలోకి వస్తుందని, వికేశ్ తండ్రి నాగేశ్వర్ రాయ్ తెలిపారు.

మే 17న కొందరు భారతీయులు సరిహద్దు దాటి నేపాల్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించగా... వారిని చెదరగొట్టడానికి నేపాల్ పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. భారత్, నేపాల్ మధ్య 1850 కి.మీ. సరిహద్దు ఉంది. ఉపాధి కోసం, బంధువులను కలవడం కోసం ఇరు దేశాల ప్రజలు తరచుగా సరిహద్దులు దాటుతుంటారు. కరోనా ప్రభావంతో మార్చి 22న నేపాల్ తన అంతర్జాతీయ సరిహద్దులను మూసివేసింది.

Read Also: మంత్రి హరీష్ రావు పీఏకు కరోనా పాజిటివ్!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.