యాప్నగరం

లోయలో పడిన బస్సు.. 16 మంది అమర్‌నాథ్ యాత్రికుల మృతి

​ అమర్‌నాథ్ యాత్రికులతో జమ్ము-శ్రీనగర్ హైవే మీదుగా వెళ్తున్న బస్సు లోయలో పడిన ఘటనలో 16 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు.

TNN 16 Jul 2017, 6:29 pm
అమర్‌నాథ్ యాత్రికులతో జమ్ము-శ్రీనగర్ హైవే మీదుగా వెళ్తున్న బస్సు లోయలో పడిన ఘటనలో 16 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. జమ్మూ సమీపంలో.. రంబన్ జిల్లా నచా నల్లా దగ్గర ఈ ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడటంతో.. 20 మందికి పైగా గాయపడినట్టు సమాచారం. జమ్మూ నుంచి పహల్‌గామ్ వెళ్తుండగా.. బస్సు ప్రమాదానికి గురైంది. క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు.. సహాయక చర్యలను చేపట్టారు.
Samayam Telugu 10 amarnath pilgrims killed as bus falls into gorge in jks ramban district
లోయలో పడిన బస్సు.. 16 మంది అమర్‌నాథ్ యాత్రికుల మృతి


#WATCH: Rescue operation by Army underway as bus carrying Amarnath Yatra pilgrims fell off road on Jammu-Srinagar highway in Ramban, 11 dead pic.twitter.com/f1anBmdtdd — ANI (@ANI_news) July 16, 2017
జూలై 10న రాత్రి సమయంలో అమర్‌నాథ్ యాత్రికులు వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో 8 మంది మరణించగా, భారీ సంఖ్యలో యాత్రికులు గాయపడిన సంగతి తెలిసిందే. అనంతనాగ్ జిల్లాలో పోలీస్ అవుట్‌పోస్ట్‌పై దాడి చేసిన ఉగ్రవాదులు.. అనంతరం బస్సుపై కాల్పులకు తెగబడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.