యాప్నగరం

పదేళ్ల బాలికపై నెలల తరబడి 12 ఏళ్ల బాలుడి అత్యాచారం.. గర్భం దాల్చిన బాలిక

12 ఏళ్ల బాలుడు నెలల తరబడి అత్యాచారం చేయడంతో 10 ఏళ్ల బాలిక గర్భం దాల్చింది. ఈ షాకింగ్ సంఘటన మహారాష్ట్రలో చోట చేసుకుంది.

Samayam Telugu 2 Mar 2019, 7:48 pm
పదేళ్ల అమ్మాయి 12 ఏళ్ల అబ్బాయి చేతిలో పదే పదే అత్యాచారానికి గురైంది. ఫలితంగా అభం శుభం తెలియని వయసులో ఆ బాలిక గర్భం దాల్చింది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన సంచలనం రేపుతోంది. మైనర్లయిన ఇద్దరూ ఇరుగు పొరుగు ఇళ్లలో ఉంటున్నారు. గత నాలుగు నెలలుగా ఆ అబ్బాయి.. అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు.
Samayam Telugu pregn


కొద్ది రోజుల క్రితం కడుపులో నొప్పిగా ఉందని బాలిక చెప్పడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఆ పాప గర్భం దాల్చిందని డాక్టర్లు తెలిపారు. దీంతో షాకైన తల్లిదండ్రులు ఆరా తీయగా.. బాలిక అసలు విషయం చెప్పింది. తమ చిన్నారిని గర్భవతి చేసిన 12 ఏళ్ల బాలుడిపై ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.