యాప్నగరం

గుజరాత్‌ రాజ్యసభ పోరు: విజయం తమదేనంటున్న బీజేపీ

దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన గుజరాత్ రాజ్యసభ ఎన్నికలకు ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది.

TNN 8 Aug 2017, 10:44 am
దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన గుజరాత్ రాజ్యసభ ఎన్నికలకు ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి అహ్మదాబాద్‌లోని అసెంబ్లీ భవనంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఎమ్మెల్యేలు ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. గత రెండు దశాబ్దాలుగా గుజరాత్‌లో రాజ్యసభ ఎంపీలను ఏకగ్రీవంగానే ఎన్నుకుంటున్నారు. ఈ సారి మాత్రం మూడు స్థానాల కోసం నలుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్‌ నుంచి అహ్మద్‌ పటేల్‌ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో పోరు ఆసక్తికరంగా మారింది.
Samayam Telugu 100 sure about victory says gujarat cm vijay rupani
గుజరాత్‌ రాజ్యసభ పోరు: విజయం తమదేనంటున్న బీజేపీ


ఇటీవల కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చిన సీనియర్ నేత శంకర్‌సిన్హ వాఘేలా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాను అహ్మద్ పటేల్‌కు ఓటు వేయలేదని, ఆయన గెలిచే అవకాశమే లేదని వాఘేలా వెల్లడించారు. అలాగే అభ్యర్థులు అమిత్‌ షా, స్మృతి ఇరానీ, బల్వంత్‌సింగ్ రాజ్‌పుత్‌తో పాటు గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు విజయం సాధిస్తారని విజయ్‌ రూపానీ ధీమా వ్యక్తం చేశారు. ఎన్సీపీ, జేడీయూ, కొటాడియా మద్దతు తమకే ఉందని, వాఘేలాతో పాటు మరికొంతమంది బీజేపీకే ఓటు వేస్తారని చెప్పారు. కచ్చితంగా గెలుపు తమదేనన్నారు.

మరోవైపు ఆనంద్‌ జిల్లాలోని ఓ రిసార్ట్‌లో ఉంచిన 44 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ నేరుగా పోలింగ్‌ కేంద్రానికి తీసుకువచ్చింది. ఓ ప్రత్యేక బస్సులో ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.