యాప్నగరం

భలే బామ్మ.. వయస్సు 105 ఏళ్లు.. పరుగు పందెంలో ఫస్ట్

వయస్సు మీద పడడంతో చాలామంది ఇంట్లో మూల కూర్చోవడమే వాళ్ల పని వృద్ధులను తక్కువగా చూస్తుంటారు. కానీ ఈ చులకన భావాన్ని ఓ బామ్మ పటాపంచలు చేసింది. 105 ఏళ్ల వయస్సులో సరికొత్త రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. హర్యాణాకు చెందిన రామ్ బాయి అనే పెద్దావిడ 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని.. బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. 00 మీటర్ల రేసును కేవలం 45.40 సెకన్లలో పూర్తి చేసింది. ఈ వయస్సులో కూడా ఆమె అంత బలంగా ఉండడానికి కారణాలు లేకపోలేదు. ఆమె క్రమశిక్షణతో కూడిన జీవనశైలే దానికి కారణం.

Authored byAndaluri Veni | Samayam Telugu 23 Jun 2022, 4:13 pm
వయస్సు మీద పడిందని బాధపడేవాళ్లకి ఓ బామ్మ స్ఫూర్తిగా నిలిచింది. 105 ఏళ్ల వయస్సులో పరుగు పందెంలో ఫస్ట్ వచ్చింది. హర్యానాలోని చర్కిదాద్రికి చెందిన రామ్ బాయి.. ఈ ఘనతను దక్కించుకుంది. గత వారం నేషనల్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన నేషనల్ ఓపెన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల రేసును కేవలం 45.40 సెకన్లలో పూర్తి చేసింది. అంతేకాదు ఆమె స్ప్రింట్స్‌లో గోల్డెన్ డబుల్‌ని కూడా సాధించింది. ఆ తర్వాత ఆదివారం ఒక నిమిషం 52.17 సెకన్లలో 200 మీటర్ల రేసును పూర్తి చేసింది.
Samayam Telugu భలే బామ్మ.. వయస్సు 105 ఏళ్లు.. పరుగు పందెంలో ఫస్ట్


వందేళ్లు పైబడిన మహిళలకు మాత్రమే ఈ రేసును నిర్వహించారు. రామ్ బాయి మొదటి స్థానంలో నిలిచిన రేసులో 85 ఏళ్లు పైబడిన వారు ఎవరూ పాల్గొనలేదు. అలాంటిది 105 ఏళ్ల రామ్ బాయి పరుగు పందెంలో పాల్గొని.. కప్పుతో పాటు బంగారు పతకాన్ని గెలుచుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. దీంతో ఆమెతో సెల్ఫీలు దిగేందుకు అందరూ పోటీ పడ్డారు. ఈ సందర్భంగా రామ్ బాయి మాట్లాడుతూ ఇది ఒక గొప్ప అనుభూతి అని అన్నారు. కాగా నవంబర్ 2021లో పరుగు పెట్టడం ప్రారంభించింది.


అయితే ఈ వయస్సులో కూడా ఆమె ఇంత బలంగా ఉండడానికి ఆమె జీవన శైలే కారణం. ఉదయం ఐదు గంటలకు నిద్ర లేస్తారు. నాలుగు కిలోమీటర్లు రన్నింగ్ చేస్తారు. పాలు, పెరుగు, 250 గ్రాముల నెయ్యి ఆమె భోజనంలో కచ్చితంగా ఉంటాయి. అయితే రామ్ బాయి కుటుంబంలో అందరూ మంచి క్రీడాకారులే. వాళ్లు కూడా ఎన్నో పతకాలు సాధించారు. రామ్ బాయి కుమార్తె సంత్రాదేవి (62) రిలే రేసులో స్వర్ణ పతకం సాధించారు. సంత్రాదేవి కుమారులు ముఖ్తార్ సింగ్, వధు భతేరిలు కూడా 200 మీటర్ల రేసులో కాంస్య పతకాలను గెలుచుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.