యాప్నగరం

నదిలో పడిన బస్సు.. 11మంది మృతి!

జమ్మూకశ్మీర్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. కిష్టావర్‌ జిల్లాలోని 'మాచెల్ మాతా' దర్శనానికి వెళుతున్న భక్తులతో కూడిన బస్సు మంగళవారం (ఆగస్టు 21) అదుపు తప్పి చీనాబ్ నదిలో పడిపోయింది.

Samayam Telugu 21 Aug 2018, 2:05 pm
జమ్మూకశ్మీర్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. కిష్టావర్‌ జిల్లాలోని 'మాచేల్ మాతా' దర్శనానికి వెళుతున్న భక్తులతో కూడిన బస్సు మంగళవారం (ఆగస్టు 21) అదుపు తప్పి చీనాబ్ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది మరణించగా.. 9 మంది గాయపడ్డారు. విషయం తెలసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఐదేళ్ల బాలిక పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Samayam Telugu River


ఇటీవల కురుస్తున్న వర్షాలకు జమ్మూలో రోడ్డన్నీ పాడయ్యాయని, దీంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మృతుల వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

కిష్టావర్‌ జిల్లాలోని మాచేల్ గ్రామంలో కొలువైన దుర్గమాతా ఆలయానికి ఏటా లక్షల సంఖ్యలో భక్తులు విచ్చేస్తుంటారు. ఈ ఏడాది జులై 25న యాత్ర ప్రారంభంకాగా.. ఇప్పటివరకు 1,02,224 మాచేల్ మాతాను దర్శించుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.