యాప్నగరం

గొంతులో ఇరుక్కొన్న ఇడ్లీ.. విద్యార్థిని మృతి

ఇడ్లీ ఓ స్కూల్ విద్యార్థిని పాలిట మృత్యువయ్యింది. ఉదయం స్కూల్‌కు వెళ్లే ముందు ఇడ్లీ తింటుండగా... గొంతులో ఇరుక్కొని ప్రాణాలు పోయాయి.

TNN 17 Mar 2018, 10:15 am
ఇడ్లీ ఓ స్కూల్ విద్యార్థిని పాలిట మృత్యువయ్యింది. ఉదయం స్కూల్‌కు వెళ్లే ముందు ఇడ్లీ తింటుండగా... గొంతులో ఇరుక్కొని ప్రాణాలు పోయాయి. చెన్నైలోని నాగర్‌కోవిల్ సమీపంలోని ఇలంగడకు చెందిన అఫ్రిన్... ఆరో తరగతి చదువుతోంది. ఆమె ఉదయం తల్లితో కలిసి కూర్చొని అప్పటి వరకు బాగానే మాట్లాడింది. తర్వాత ఇద్దరూ కలిసి ఇడ్లీ తింటున్నారు. ఇంతలో గొంతులో ఇడ్లీ ఇరుక్కుపోయింది. ఆమె ఊపిరి తీసుకోలేక కొంతసేపు ఇబ్బందపడింది. భయంతో వణికిపోయిన తల్లి ఆమెను వెంటనే భర్తను పిలిచింది.
Samayam Telugu 13 years school girl dies idle stuck in throat
గొంతులో ఇరుక్కొన్న ఇడ్లీ.. విద్యార్థిని మృతి


అఫ్రిన్ ఆరోగ్య పరిస్థితి చూసి... వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే ఈలోపే ఆమె చనిపోయింది. డాక్టర్లు కూడా ఇడ్లీ గొంతులో ఇరుక్కోవడం వల్లే చనిపోయిందని తేల్చారు. అప్పటి వరకు సరదాగా కనిపించిన కూతురు కళ్లముందే చనిపోవడంతో తల్లిదండ్రులు కుమిలిపోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.