యాప్నగరం

ఎండ వేడికి 15 కార్లు కాలి బూడిదయ్యాయి

ఎండల వేడి తీవ్రత ఎలా వుందో చాటిచెప్పేందుకు ప్రత్యక్ష ఉదాహరణే ఈ ఘటన. అపార్ట్‌మెంట్ పార్కింగ్‌లో...

Mumbai Mirror 3 Apr 2017, 5:33 pm
ఎండల వేడి తీవ్రత ఎలా వుందో చాటిచెప్పేందుకు ప్రత్యక్ష ఉదాహరణే ఈ ఘటన. ముంబైలోని కుర్లాకి సమీపంలోని స్కైలైన్ ఓయాసిస్ కోఆపరేటివ్ హౌసింగ్ సోసైటీ అపార్ట్‌మెంట్ పార్కింగ్‌లో వేడిమి కారణంగా చెలరేగిన అగ్ని ప్రమాదంలో 15 కార్లు కాలి బుగ్గిపాలయ్యాయి. 13 అంతస్తుల బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుందని ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకి అగ్నిమాపక శాఖ కంట్రోల్ రూమ్‌కి ఓ ఫోన్ వచ్చింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకునేలోపే 15 కార్లు కాలిబూడిదయ్యాయి.
Samayam Telugu 15 cars charred in parking lot as heat sparks
ఎండ వేడికి 15 కార్లు కాలి బూడిదయ్యాయి


కాలిపోయిన కార్లలో బీఎండబ్ల్యూ, ల్యాండ్ రోవర్ డిస్కవరీ, హోండా అకార్డ్, టొయొటా ఇన్నోవా, వ్యాగనార్ వంటి కార్లు వున్నాయి. దాదాపు 2 గంటలపాటు శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకువచ్చారు అగ్నిమాపక సిబ్బంది. మంటలు పార్కింగ్ లాట్ వరకే పరిమితం అవడంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే, ఊహించని ప్రమాదమే జరిగేది.

భవనం కింద పార్కింగ్ లాట్ చుట్టూ టార్పాలిన్లు కట్టి వుండటంతో అందులోని వేడిమి బయటికి వెళ్లడానికి వీలులేకపోయింది. దీనికితోడు కార్లలో వుండే ఇంధనం, సీటు కుషన్స్ వంటివన్నీ సులభంగా మండే స్వభావం వుండేవే కావడం ఈ అగ్ని ప్రమాదానికి ఓ కారణమై వుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.