యాప్నగరం

ముంబై పేలుళ్ల నిందితుడు యూసఫ్ మెమన్ మృతి

Mumbai Blasts: 1993 ముంబై పేలుళ్ల నిందితుడు యూసఫ్ మెమన్ జైల్లో మరణించాడు. అతడి మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.

Samayam Telugu 26 Jun 2020, 6:48 pm
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 1993లో విధ్వంసం సృష్టించిన వరుస బాంబు పేలుళ్ల కేసు నిందితుడు, గ్యాంగ్‌స్టర్ టైగర్‌ మెమన్‌ సోదరుడు యూసఫ్ మెమన్ మృతి చెందాడు. మహారాష్ట్రలోని నాసిక్‌ జైలులో శుక్రవారం (జూన్ 26) ఉదయం యూసఫ్ మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. అయితే, అతడు ఎలా మరణించాడనే విషయాన్ని మాత్రం అధికారులు ఇంకా వెల్లడించలేదు.
Samayam Telugu ముంబై పేలుళ్లు
Mumbai Blasts


ముంబై పేలుళ్ల కేసులో న్యాయస్థానం 2007లో యూసఫ్ మెమన్‌ను దోషిగా నిర్ధారించింది. అతడికి జీవిత ఖైదు విధించింది. దీంతో అతడిని తొలుత ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో ఉంచారు. అనంతరం 2018లో అక్కడి నుంచి నాసిక్‌ జైలుకు మార్చారు. నాటి నుంచి అక్కడే శిక్ష అనుభవిస్తున్నాడు.

నాసిక్ జైల్లో యూసఫ్‌ మెమన్‌కు శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో గుండెపోటు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే.. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. యూసఫ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధూలేకు తరలించినట్లు అధికారులు తెలిపారు.

ముంబై వరుస బాంబు పేలుళ్ల ఘటన తర్వాత గ్యాంగ్‌స్టర్‌ టైగర్‌ మెమన్‌ భారత్‌ నుంచి పరారయ్యాడు. యూసఫ్‌ సోదరుడు ఇసాక్‌ మెమన్‌ కూడా ముంబై పేలుళ్ల కేసులో నాసిక్‌ జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నాడు. ముంబైలో 1993 మార్చి 12న వరుస బాంబు పేలుళ్లతో విధ్వంసం సృష్టించారు. ఈ పేలుళ్లలో 257 మంది మృతి చెందారు. 1000 మందికి పైగా గాయపడ్డారు.

Also Read: పిడుగులు పడి 83 మంది మృతి.. బీహార్‌లో బీభత్సం

Watch: సరిహద్దులో సైన్యం సై.. యుద్ధవిమానాల గర్జన

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.