యాప్నగరం

పైలట్ తప్పిదం.. ట్యాక్సీ వేలో విమానం టేకాఫ్!

జెట్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం రన్‌వేపై కాకుండా, ట్యాక్సీ వే‌లో టేకాఫ్ అయ్యేందుకు ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Samayam Telugu 6 Aug 2018, 6:03 pm
జెట్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం రన్‌వేపై కాకుండా, ట్యాక్సీ వే‌లో టేకాఫ్ అయ్యేందుకు ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన సౌదీ అరేబియాలోని రియాద్‌లో చోటు చేసుకుంది. ఆ సమయంలో విమానంలో 150 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ తప్పిదానికి బాధ్యులైన ఇద్దరు పైలట్లపై డీజీసీఏ చర్యలు తీసుకుంది.
Samayam Telugu photo


వివరాల్లోకి వెళ్లితే... రియాద్ నుంచి ముంబయికి బయల్దేరిన బోయింగ్ 737 జెట్‌ ఎయిర్‌వేస్ విమానం రన్ మీద నుంచి కాకుండా, దానికి సమాంతరంగా ఉన్న ట్యాక్సీ వేలోకి ప్రవేశించింది. టేకాఫ్ కోసం వేగంగా ప్రయాణించి.. ఇసుకలో కూరుకుపోయింది. దీంతో, రన్‌వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై.. హుటాహుటిన విమానం వద్దకు చేరారు. రెస్క్యూ సిబ్బంది ప్రయాణికులను ఎమర్జెన్సీ స్లైడ్స్ ద్వారా కిందికి దించారు.

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. ఆ విమానం నడిపిన ఇద్దరు పైలట్ల ఫ్లయింగ్ లైసెన్స్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఘనపై సౌదీ, భారత వైమానిక సంస్థలు సంయుక్తంగా దర్యాప్తు జరుపుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.