యాప్నగరం

మా ఓట్లను మళ్లించారు: కేజ్రీవాల్

ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్స్‌నే ఉపయోగించాలని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.

TNN 15 Mar 2017, 5:06 pm
ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్స్‌నే ఉపయోగించాలని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. పనికిమాలిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)ల కారణంగా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోయామని, తమ ఓట్లలో 20 నుంచి 25 శాతం శిరోమణి అకాలీదళ్‌ (ఎస్ఏడీ)కు వెళ్లిపోయాయని ఆరోపించారు. కాబట్టి ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఈవీఎంలకి బదులు పేపర్ బ్యాలెట్‌లు వాడాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఢిల్లీలో ఆయన బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు.
Samayam Telugu 20 25 of aaps votes was transferred to akalis arvind kejriwal
మా ఓట్లను మళ్లించారు: కేజ్రీవాల్


పంజాబ్‌లో ఆప్ విజయం ఖాయమని ఎగ్జిట్ పోల్స్‌ స్పష్టం చేయడాన్ని కేజ్రీవాల్ ఉదహరిస్తూ.. ‘అకాలీదళ్‌పై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఈ ఎన్నికలను ఆప్ తుడిచిపెడుతుందని చాలా మంది చెప్పారు. కానీ ఆప్‌కి 25 శాతం, ఎస్‌ఏడీకి 31 శాతం ఓట్లు వచ్చాయి. ఇదెలా సాధ్యం?’ అని ప్రశ్నించారు. అకాలీదళ్-బీజేపీ కూటమి కావాలనే తమను దొంగదెబ్బ తీసిందని ఆయన ఆరోపించారు. ‘20 నుంచి 25 శాతం ఆప్ ఓట్లు ఎస్ఏడీకి బదిలీ కావడం వల్లే పంజాబ్‌లో కాంగ్రెస్ గెలిచింది. అలాగే అకాలీదళ్ కూడా విజయం సాధించింది. తమను ఏదోరకంగా ఓడించాలని ప్రయత్నించి చివరకు సాధించింది’ అని కేజ్రీవాల్ ఆరోపించారు.

తాను ఈవీఎంలపై చేస్తున్న ఆరోపణల్లో న్యాయముందని తెలియజేస్తూ సుప్రీం కోర్టు వ్యాఖ్యలను ప్రస్తావించారు. ‘ఈవీఎంలను ట్యాంపర్ చేయొచ్చని సుప్రీం కోర్టు చెప్పింది. మేం చెప్పట్లేదు. మీరు నాపేరు మీద ఒక హ్యాష్‌ట్యాగ్ పెట్టి కామెడీ చేస్తారని నాకు తెలుసు. కానీ ఈవీఎంలను ట్యాంపర్ చేయగలిగారు అంటే దానర్థం దేశంలో ప్రజాస్వామ్యం అంతమైనట్టే’ అని వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.